హర్యానా, జమ్ముకశ్మీర్ ఫలితాలు వెలువడుతున్నాయి.. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ దూసుకెళ్తోంది.. హర్యానా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్స్‌ను దాటేసింది.. ఇటు జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి ఆధిక్యంలో ఉంది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. హర్యాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. 54 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది.. 31చోట్ల బీజేపీకి ఆధిక్యంలో ఉంది.. ఐఎన్ఎల్‌డీ 3, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
జమ్ముకశ్మీర్ లో 45 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. ఎన్డీఏ 31, పీడీపీ 03, ఇతరులు 11 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
అయితే.. హర్యానా, జమ్మూకశ్మీర్ లో పలువురు ప్రముఖులు విజయం వైపు దూసుకెళ్తున్నారు. రెజ్లర్ వినేష్ ఫొగాట్ జులనాలో ముందంజలో కొనసాగుతున్నారు. జులనా బీజేపీ అభ్యర్థి యోగేష్ బైరాగి వెనుకంజలో ఉన్నారు.
కాంగ్రెస్ నాయకుడు, హర్యానా నుంచి రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన భూపిందర్ సింగ్ హుడా గర్హి సంప్లా-కిలోయి స్థానం నుంచి ముందంజలో ఉన్నారు.
హర్యానాలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ లాడ్వాలో ముందంజలో ఉన్నారు.
జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా డబ్వాలీ లో వెనుకంజలో ఉన్నారు.
అంబాలా కంటోన్మెంట్‌లో హర్యానా మంత్రి అనిల్ విజ్ వెనుకంజలో ఉన్నారు.
హిసార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ ముందంజలో ఉన్నారు.
గందర్‌బల్, బుద్గామ్ నుంచి పోటీ చేసిన ఎన్‌సీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండు నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. నౌషెరాలో బిజెపికి చెందిన జె అండ్ కె చీఫ్ రవీందర్ రైనా ముందంజలో ఉండగా, కుప్వారాలో ఎన్‌సికి చెందిన సజాద్ గని లోన్ వెనుకంజలో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..