Assam floods: అసోంలో వరదల బీభత్సం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. నిరాశ్రయులైన లక్షల మంది..

|

May 18, 2022 | 7:55 AM

అసోం(Assam)లో వరదలు(floods) కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాలలో వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు...

Assam floods: అసోంలో వరదల బీభత్సం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. నిరాశ్రయులైన లక్షల మంది..
Assam Floods
Follow us on

అసోం(Assam)లో వరదలు(floods) కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాలలో వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. తాజాగా వరదల వల్ల ముగ్గురు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వ బులెటిన్‌ విడుదల చేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో పొరుగున ఉన్న త్రిపుర(Tripura), మిజోరాం, మణిపూర్‌తో సహా అస్సాంలోని బరాక్ వ్యాలీ, దిమా హసావో జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో మంగళవారం రోడ్డు, రైలు కనెక్టివిటీ తెగిపోయింది. అస్సాం, మేఘాలయలో చాలా చోట్ల రోడ్డు, రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. రెండు వందలకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. సోమవారం వరకు 20 జిల్లాల్లో 1,97,248 మంది వరదల వల్ల ఇబ్బుందులు పడ్డారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) బులెటిన్ తెలిపింది.

న్యూ హఫ్లాంగ్ రైల్వే స్టేషన్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. కొండ చరియలు విరిగిపడి వరదనీరు పోటెత్తడంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్‌లోని రెండు రైళ్లు కూడా వరదనీటిలో మునిగిపోయాయి. మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ అస్సాంలోని బరాక్ వ్యాలీ, మూడు ఈశాన్య రాష్ట్రాలలోని ముఖ్యమైన ప్రాంతాలకు రహదారి కనెక్టివిటీకి అంతరాయం ఏర్పడింది. ఈస్ట్ జైంతియా హిల్స్ పోలీసులు తమ అధికార పరిధిలో తాజాగా కొండచరియలు విరిగిపడటంతో అప్రమత్తమయ్యారు. రోడ్డు, రైలు కనెక్టివిటీకి అంతరాయం కలగడంతో విమాన ఛార్జీలు పెరిగాయి. విమాన ప్రయాణ టిక్కెట్ల ధరల సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని సిల్చార్ ఎంపీ రాజ్‌దీప్ ట్వీట్‌ చేశాడు. ప్రధానమంత్రి, అతని కార్యాలయం, పౌర విమానయాన మంత్రి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను ట్యాగ్ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…