Earthquake: అర్ధరాత్రి అండమాన్‌ నికోబార్‌ దీవులలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతగా నమోదు..

|

May 09, 2022 | 6:00 AM

Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో అర్థరాత్రి 1.11 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Earthquake: అర్ధరాత్రి అండమాన్‌ నికోబార్‌ దీవులలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతగా నమోదు..
Earthquake
Follow us on

Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో అర్థరాత్రి 1.11 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీనికి ముందు కూడా గత నెలలో ఇక్కడ భూకంపం సంభవించింది. ఆ సమయంలో రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.9గా నమోదైంది. తరచుగా ఇక్కడ భూకంపం సంభవిస్తుండటంతో ప్రజలు భయందోళనకి గురవుతున్నారు.

గిర్ సోమనాథ్ జిల్లాలోని ఓ గ్రామంలో భూమి రెండుసార్లు కంపించింది

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ నెల 2వ తేదీన రెండుసార్లు భూకంపం సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండుసార్లు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0, 3.2గా నమోదైంది. గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) ప్రకారం.. 4 తీవ్రతతో కూడిన భూకంపం ఉదయం 6.58 గంటలకు సంభవించింది. ఇది తాలాల గ్రామానికి ఉత్తర-ఈశాన్యంగా 13 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రెండో భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.2 కొలతలతో ఉదయం 7.04 గంటలకు సంభవించింది. ఇది తలాలా గ్రామానికి ఉత్తర-ఈశాన్యంగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అయితే రెండు చోట్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CSK vs DC: ఇరగదీసిన చెన్నై బౌలర్లు.. తేలిపోయిన ఢిల్లీ బ్యాటర్లు..

IPL 2022: జోస్‌ బట్లర్ ప్రత్యేక రికార్డ్‌.. ఆ విషయంలో తొలి రాజస్థాన్‌ ఆటగాడు..!

ICE Tea Side Effects: వేసవిలో ఐస్‌ టీ ఎక్కువగా తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే దాని జోలికి అస్సలు వెళ్లరు..!