వ్యాక్సిన్ పై అనుమానాలు వద్దు, విమర్శకులకు ఇదే నా సవాల్ ! హోం మంత్రి అమిత్ షా, ప్రతివారూ టీకామందు వేయించుకోవాల్సిందే

కోవిడ్ వ్యాక్సిన్ పై అనుమానాలు వద్దని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ వ్యాక్సిన్ నాణ్యత, సామర్థ్యం పై సందేహాలు వ్యక్తం చేస్తున్నవారికి..

వ్యాక్సిన్ పై అనుమానాలు వద్దు, విమర్శకులకు ఇదే నా సవాల్ ! హోం మంత్రి అమిత్ షా, ప్రతివారూ టీకామందు వేయించుకోవాల్సిందే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2021 | 1:19 PM

కోవిడ్ వ్యాక్సిన్ పై అనుమానాలు వద్దని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ వ్యాక్సిన్ నాణ్యత, సామర్థ్యం పై సందేహాలు వ్యక్తం చేస్తున్నవారికి ఇదే నా సవాల్ అన్నారాయన. ప్రజారోగ్యం పై పాలిటిక్స్ చేయడం మంచిది కాదన్నారు ఇటీవల . కొవాగ్జిన్ వ్యాక్సిన్ నాణ్యతపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం గమనార్హం. గౌహతీలో శనివారం సాయుధ పోలీసు దళాల కోసం ఆయన ‘ఆయుష్మాన్ సీఏపీఎఫ్’ పథకాన్ని లాంచ్ చేశారు. మీ వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. టీకామందుపై కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందింప జేస్తున్నారని, వారితో తాను చర్చకు రెడీ అని అమిత్ షా ప్రకటించారు. హెల్త్ వర్కర్ల అనంతరం మీరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన పోలీసు దళాలను కోరారు. ఏ విధమైన సందేహం వద్దన్నారు. కొంతమంది సిబ్బందికి ఆయన ఈ పథకం తాలూకు హెల్త్ కార్డులను అందజేశారు. దేశంలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఓ బృహత్తర కార్యక్రమమన్నారు.  రెండు రోజుల పర్యటనకు గాను అయన అస్సాం విజిట్ చేస్తున్నారు.

Also Read:

జీడీపీలో ‘అద్భుతమైన వృద్ధి’, మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్, పెట్రో ఉత్పత్తుల ధరలే నిదర్శనమని వ్యాఖ్య

సర్కారుకి చెడ్డపేరు తీసుకురావాలన్నదే ఎస్ఈసీ లక్ష్యం, నిమ్మగడ్డపై దాడిచేయాల్సిన అవసరం నాకు లేదు : వెంకట్రామిరెడ్డి

వెబ్ సరీస్‌పై ఫోకస్ పెట్టిన మహేశ్ డైరెక్టర్.. అతడి ప్రాజెక్ట్ పక్కన పెట్టడం వల్లే ఇలా చేస్తున్నాడా!