Rajasthan: అలా చేయడమే అతని పాలిట శాపమైంది.. మూత్రం తాగించి మరీ పైశాచికం..

|

Nov 26, 2022 | 6:38 AM

భారత సమాజంలో దళితులపై అగ్రవర్ణాల దాడులు నిత్యకృత్యంగా మారాయి. అందరూ సమానమేనని.. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. అనాదిగా వస్తున్న దురాచారాన్ని ఇప్పటికీ...

Rajasthan: అలా చేయడమే అతని పాలిట శాపమైంది.. మూత్రం తాగించి మరీ పైశాచికం..
Attack
Follow us on

భారత సమాజంలో దళితులపై అగ్రవర్ణాల దాడులు నిత్యకృత్యంగా మారాయి. అందరూ సమానమేనని.. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. అనాదిగా వస్తున్న దురాచారాన్ని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. చదువుకున్నామన్న ఇంగిత భావం లేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ఈ సమయంలో దళితులపై దాడులు జరగడం సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తోంది. తాను చేసిన పనికి డబ్బులు అడగడమే అతని పాలిట శాపమైంది. మమ్మల్నే డబ్బులు అడుగుతావా అని రెచ్చిపోయిన ప్రబుద్ధులు ఉన్నాదుల్లా బిహేవ్ చేశారు. మూకుమ్మడిగా బాధితుడిపైదాడి చేశారు. అంతటితో ఆగకుండా మూత్రం తాగించారు. సుమారు 5 గంటల పాటు ఈ దారుణ కాండ జరగడం గమనార్హం. రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాకు చెందిన భరత్ కుమార్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పని కోసం ఓ ఇంటికి వెళ్లిన భరత్ కుమార్.. తీవ్ర అవమానానికి గురయ్యాడు.

ఇంట్లో చేసిన మొత్తం పనికి రూ.21,100 బిల్లు అయింది. అయితే ఆ ఇంటి యజమాని కేవలం రూ.5000 మాత్రమే ఇచ్చాడు. మిగతా డబ్బులు కూడా ఇవ్వాలని కోరినా అతను ఒప్పుకోలేదు. ఈ క్రమంలో నవంబర్ 19 న భరత్ కుమార్.. డబ్బు కోసం దాబా వద్దకు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు వస్తే ఇస్తామని చెప్పడంతో వెనుదిరిగి మళ్లీ రాత్రి 9:10 గంటలకు దాబా వద్దకు వెళ్లాడు. ఎంతసేపు వెయిట్ చేసినా భరత్ కుమార్ కు డబ్బులు ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసహనంతో తన డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భరత్ కుమార్ హెచ్చరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితులు ఒక్కసారిగా భరత్ కుమార్ పై దాడికి పాల్పడ్డారు.

కిందపడేసి కొట్టారు. మెడలో చెప్పుల దండ వేశారు. అంతటితో కూడా ఆగకుండా బలవంతంగా మూత్రం తాగించారు. దాదాపు 5 గంటల పాటు దాడి చేశారు. నిందితుల్లో ఒకరు ఈ ఉదంతాన్ని తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. సమాచారం అందుకున్న సిరోహి డీఎస్పీ దినేష్ కుమార్.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నవంబర్ 23న ముగ్గురు నిందితులపై భరత్ కుమార్ ఫిర్యాదు చేశాడు. అతని కంప్లైంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం