Monkeypox: ఢిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు.. ఆసుపత్రిలో చేరిన నైజీరియ‌న్‌..

|

Aug 02, 2022 | 5:18 AM

నైజీరియన్ వ్యక్తి ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎల్‌ఎన్‌జెపిలో చేరి చికిత్స పొందుతున్నాడు. నైజీరియన్ గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని.. అతని శరీరంపై దద్దుర్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Monkeypox: ఢిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు.. ఆసుపత్రిలో చేరిన నైజీరియ‌న్‌..
Monkeypox
Follow us on

Monkeypox: దేశంలో మంకీపాక్స్ అలజడి రేపుతోంది. ఇప్పటికే ఐదుగురు మంకీపాక్స్ వైరస్ బారిన పడగా.. తాజాగా మరో కేసు నమోదైంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో నివ‌సిస్తున్న నైజీరియ‌న్ (35) కు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీలో రెండు కేసులు నమోదు కాగా.. దేశంలో కేసుల సంఖ్య ఆరుకు చేరింది. నైజీరియన్ ఇటీవ‌ల విదేశీ పర్యటనలేమీ చేయ‌లేదని అధికారులు తెలిపారు. నైజీరియన్ వ్యక్తి ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎల్‌ఎన్‌జెపిలో చేరి చికిత్స పొందుతున్నాడు. నైజీరియన్ గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని.. అతని శరీరంపై దద్దుర్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోకిన వారు ఇటీవల విదేశాలకు లేదా దేశంలో ఎక్కడికి వెళ్లలేదని పేర్కొన్నారు. నైజీరియన్ వ్యక్తి పరీక్షల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారు. అతని పరీక్ష రిపోర్టులు సోమవారం సాయంత్రం వచ్చిందని అధికార పవర్గాలు తెలిపారు. అయితే.. ఆఫ్రికా ఖండానికి చెందిన ఇద్దరు అనుమానిత రోగులు కూడా ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వారికి కూడా మంకీ పాక్స్ సోకే అవకాశం ఉందని.. వారీ పరీక్ష నమూనాలను పూణే పంపించారు.

కాగా.. కేరళలోని త్రిస్సూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంకీపాక్స్‌తో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఇటీవలే తిరిగి వచ్చిన యువకుడు మంకీపాక్స్ మరణించినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కాగా.. మంకీపాక్స్ విషయంలో భారత ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. దేశంలో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులను పర్యవేక్షించేందుకు మోదీ ప్రభుత్వం ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందానికి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ నేతృత్వం వహించనున్నారు. ఈ సభ్యులలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఫార్మా, బయోటెక్ కార్యదర్శులు ఉంటారు.

77 దేశాల్లో మంకీపాక్స్ కేసులు..

ఇవి కూడా చదవండి

మంకీపాక్స్ మహమ్మారి ఇప్పటివరకు 77 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ వ్యాధితో సుమారు 75 మంది మరణించారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంకీపాక్స్‌కు సంబంధించి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..