షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

బుధవారం నాడు జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని సుగో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2020 | 9:00 PM

బుధవారం నాడు జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని సుగో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. షోపియాన్ జిల్లా పోలీసులకు సుగో ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. పోలీసులు, సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు చేపట్టాయి. దాదాపు మూడు గంటలకు పైగా ఎన్‌కౌంటర్‌ కొనసాగింది. చివరకు ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సైన్యానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. మరణించిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దిన్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఒకరు మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాది అని తెలిపారు.

కాగా, గడిచిన మూడు రోజుల్లో జరిగిన పలు ఎన్‌కౌంటర్‌లో మొత్తం 14 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఈ ఘటనల్లో పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??