Hair Loss: జుట్టు ఊడిపోతుందని యువతి దారుణ నిర్ణయం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

చూస్తుండగానే కొన్ని రోజుల్లోనే జుట్టు (hair loss problem) మొత్తం ఊడిపోతూ రూపురేఖలన్నీ మారాయి. దీనికి చికిత్స కోసం ఆమె ఎన్నో చికిత్సలు చేయించుకుంది. కానీ ఫలితం లేకపోవడంతో విరక్తి చెందింది.

Hair Loss: జుట్టు ఊడిపోతుందని యువతి దారుణ నిర్ణయం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
hair fall problem

Updated on: Jul 03, 2022 | 9:56 AM

Woman suicide: ఆమెకు కురులంటే ఇష్టం.. చిన్నప్పుడు కురులు చూసుకుంటూ మురిసిపోయేది.. జుట్టు కోసం ఆ యువతి ఎన్నో షాంపూలు, నూనెలతో కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ.. ఇటీవల ఓ వింత జబ్బు కారణంగా తలకున్న వెంట్రుకలు రాలడం ప్రారంభమైంది. చూస్తుండగానే కొన్ని రోజుల్లోనే జుట్టు (hair loss problem) మొత్తం ఊడిపోతూ రూపురేఖలన్నీ మారాయి. దీనికి చికిత్స కోసం ఆమె ఎన్నో చికిత్సలు చేయించుకుంది. కానీ ఫలితం లేకపోవడంతో విరక్తి చెందింది. తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన కర్ణాటకలోని మైసూరు (Mysore) నగరంలో చోటుచేసుకుంది.

మైసూరులోని రాఘవేంద్ర ఎక్స్‌టెన్షన్‌లో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు శనివారం తెలిపారు. మృతురాలిని కావ్యశ్రీ (21) గా గుర్తించారు. వింత జబ్బు కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయని.. దీంతో మనస్థాపం చెందిన కావ్యశ్రీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై నజరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కావ్యశ్రీ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి