Shyam Singha Roy : జోరు పెంచిన నేచురల్ స్టార్.. శరవేగంగా జరుగుతున్న‘శ్యామ్‌ సింగరాయ్’ షూటింగ్

నేచురల్ స్టార్ నాని హీరో గా తెరెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే నాని 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న టక్ జగదీశ్..

Shyam Singha Roy : జోరు పెంచిన నేచురల్ స్టార్.. శరవేగంగా జరుగుతున్న‘శ్యామ్‌ సింగరాయ్' షూటింగ్
Follow us

|

Updated on: Jan 07, 2021 | 8:00 AM

Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని హీరోగా తెరెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే  నాని ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న’టక్ జగదీశ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమాతో పాటు ‘శ్యామ్‌ సింగరాయ్’ కూడా కంప్లీట్  చేస్తున్నాడు. ‘టాక్సీవాలా’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

నాని కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో సాయి పల్లవి, ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ కూడా వేశారని తెలుస్తుంది. ఈ నెల 13 వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపి సంక్రాంతికి చిన్న బ్రేక్ ఇవ్వనున్నారు. ఆతర్వాత మళ్ళీ ఫుల్ స్పీడ్ తో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. వెంకట్‌ బోయిన్‌పల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కిజేమేయర్ సంగీతం అందిస్తుండగా.. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నరు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Hero Dhanush: ఆ డైరెక్టర్‏తో హీరో ధనుష్ కొత్త సినిమా.. షూటింగ్ ఫోటోను షేర్ చేసిన దర్శకుడు..

Central government : తమిళనాడు ప్రభుత్వనికి షాక్ ఇచ్చిన కేంద్రం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుందన్న హోంశాఖ..