Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన మోస్ట్‌వాంటెడ్‌ స్మగ్లర్‌

Most Wanted Red Sandal Wood Smuggler Arrested, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన మోస్ట్‌వాంటెడ్‌ స్మగ్లర్‌

అనంతపురం జిల్లాలో మోస్ట్‌వాంటెడ్‌గా స్మగ్లర్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అంతర్‌ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ మస్తాన్‌వలితో పాటుగా మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు క్రాస్‌ వద్ద ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుండి రూ. 2,70,000/ల విలువ చేసే ఐదు ఎర్రచందనం దుంగలు, హుండాయ్‌ వెర్నాకారు, ఓ స్కార్పియో, మరో ఐచర్‌ వాహనం, రూ. 25 వేల నగదు, 16 సెల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. వీరిలో పట్టుబడిన వారిలో ప్రధాన సూత్రదారి మస్తాన్‌ వలిపై గతంలో 20 కేసులకు పైగా ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్దపప్పూరు రోడ్డు క్రాసింగ్‌లో వాహనాల తనిఖీలు చేపట్టినట్లుగా తెలిపారు. ఈ క్రమంలోనే తాడిపత్తి బస్‌స్టాండ్‌ నుండి పెద్దపప్పూరుకు అతివేగంగా వెల్తున్న ఓ వెర్నాకారు, స్కార్పియో, ఐచర్‌ వాహనాలను పోలీసులు అడ్డుకున్నామని, ఆ వాహనాల్లో ఉన్నవారు తమపై రాళ్లదాడి చేసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా, చాకచక్యంగా వారిని పట్టుకున్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. మస్తాన్‌ వలి అక్రమంగా సంపాదించిన డబ్బుతో గతంలో ” ప్రేమ ప్రయాణం’ అనే సినిమా నిర్మించాడని, అందులో నటించిన హీరోయిన్‌ నీతు అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్నాడని, అయితే, పెళ్లి తర్వాత మస్తాన్‌ అసలు రూపం తెలుసుకున్న ఆమె మస్తాన్‌ను వదిలేసినట్లుగా పోలీసులు మీడియాకు వెల్లడించారు.

Most Wanted Red Sandal Wood Smuggler Arrested, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన మోస్ట్‌వాంటెడ్‌ స్మగ్లర్‌