గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో సమీక్ష.. నూతన కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్న మంత్రి కేటీఆర్..

గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలపై తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మరికాసేపట్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతోపాటు బల్దియా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో సమీక్ష.. నూతన కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్న మంత్రి కేటీఆర్..
Follow us

| Edited By: uppula Raju

Updated on: Dec 06, 2020 | 3:03 PM

గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలపై తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మరికాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతోపాటు బల్దియా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇందులో ప్రజలతో ఎలా మెలగాలనే అంశంపై మంత్రి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అంతే కాకుండా పార్టీకి సంబంధించిన పలు అంశాలను వారికి వివరించనున్నారు. ఈ నెల 1న జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున 55 మంది కార్పొరేటర్లు ఎన్నికైన సంగతి తెలిసిందే.