మిజోరం లోక్‌సభ బరిలో తొలిసారి మహిళా అభ్యర్థి

మిజోరం లోక్‌సభ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ నామినేషన్ వేశారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక లోక్‌సభ స్థానం కోసం ఆరుగురు బరిలో ఉండగా.. వారిలో 63ఏళ్ల లాల్తలా మౌని ఒకరు. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోతున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఐజ్వాల్ దక్షిణం అసెంబ్లీ స్థానం నుంచి లాల్తలా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 69 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా పట్టువదలకుండా ఇప్పుడు లోక్‌సభకు ఆమె పోటీ చేయబోతున్నారు. దీనిపై […]

మిజోరం లోక్‌సభ బరిలో తొలిసారి మహిళా అభ్యర్థి
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2019 | 5:22 PM

మిజోరం లోక్‌సభ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ నామినేషన్ వేశారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక లోక్‌సభ స్థానం కోసం ఆరుగురు బరిలో ఉండగా.. వారిలో 63ఏళ్ల లాల్తలా మౌని ఒకరు. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోతున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఐజ్వాల్ దక్షిణం అసెంబ్లీ స్థానం నుంచి లాల్తలా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 69 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా పట్టువదలకుండా ఇప్పుడు లోక్‌సభకు ఆమె పోటీ చేయబోతున్నారు.

దీనిపై లాల్తలా మాట్లాడుతూ.. ‘‘ఈ రాష్ట్రం నుంచి లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళను నేనే కావడం గర్వంగా ఉంది. దేవుడు వరమిచ్చాడు కాబట్టి బరిలోకి దిగుతున్నా. పురుష ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించడానికే పోటీకి సిద్ధమయ్యా. స్త్రీలు తలచుకుంటే దేన్నయినా సాధించగలరని నేను నిరూపిస్తా. నాకు మహిళల అండ ఉంది. మా హక్కుల సాధన కోసమే నేను పోటీ చేస్తున్నా’’ అంటూ పేర్కొన్నారు.