Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

అతనంటే పాములకు ఎంతిష్టమో తెలుసా..?

Specila story about snake catcher Anjaneyulu, అతనంటే పాములకు ఎంతిష్టమో తెలుసా..?

పాములు.. చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది పాములను పట్టుకోవడం అంటే ఇంకేముంది ఒంట్లో వణుకు పడుతుంది. కానీ, చిన్న సర్పమైనా అతిపెద్ద గిరినాగు అయినా వాటిని అవలీలగా పట్టేస్తాడు పాముల ఆంజనేయులు. అంతేకాదు..నాగులకే నాట్యం నేర్పిస్తాడు.
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడ్‌ గ్రామానికి చెందిన పాముల ఆంజనేయులు అంటే స్థానికంగా తెలియనివారుండరు. ఆయనకు పాములే నేస్తాలు. ఎక్కడ పాము ఉందని తెలిస్తే..తక్షణం అక్కడ వాలిపోతాడు. ఎంత దూరమైనా, ఎంత రాత్రైనా విషయం తెలిసిన వెంటనే పరుగున వెళ్తాడు. పాములు కూడా అతను ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోతాయి. ఎంతటి విష సర్పమైన అవలీలగా అతని చేతిలోకి వచ్చేస్తుంది. అలా పాములను ప్రేమగా చూసుకుంటాడు. వాటికి ముద్దు పేర్లు పెట్టి పిలుచుకుంటాడు. పాములను చంపకూడదని సందేశమిస్తాడు. ఎక్కడ పాము కనిపించినా తనకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాడు.
ఆంజనేయులు తన 9వ యేట నల్లమల అడవిలోకి వెళ్లి..అక్కడ కొందరు కోయదొరల వద్ద గరుడ విద్యను నేర్చుకున్నట్లుగా చెబుతున్నాడు. ఏడేళ్లపాటు గరుడ విద్యలో అభ్యసం చేసిన ఫలితంగానే ఎంతటి విషసర్పమైన తన వశమవుతుందని, తనను కాటువేయమని అంటున్నాడు. అలా ఏ పామైనా తన మాట వినాల్సిందే, తన వెంట ఎప్పుడు కనీసం రెండుమూడు పాములైనా ఉంటాయి. ఆ నీలకంఠుడి మెడలో ఉన్నట్లుగా ఆంజనేయులు కూడా నాగులను మెడలో వేసుకు తిరుగుతాడు. పాములు పట్టడంతో పాటుగా, పాముకరిచినా, తేలు కుట్టిన వారికి వైద్యం చేస్తుంటాడు. బాధితులు కొన్ని సూచనలు కూడా చేస్తుంటాడు స్నేక్‌ఫ్రెండ్‌ ఆంజనేయులు.

Specila story about snake catcher Anjaneyulu, అతనంటే పాములకు ఎంతిష్టమో తెలుసా..?
ఎవరైనా పామును చూస్తే సగం భయంతో చెమటలు పడతాయి. ఇదే మాదిరిగా పాము కాటుకు గురై వారిలో కొందరు విషం ఎక్కక ముందే భయంతో కన్నుమూస్తారు. పాము కుట్టినప్పుడు ఎటువంటి భయాందోళనలకు లోను కాకుండా తక్షణం ఆసుపత్రికి వెళితే ప్రాణాలు రక్షించుకోవచ్చునని ఆంజనేయులు చెపుతున్నాడు. సాధారణంగా పాములు మనుషులను కాటు వేయవు. తమకు హానీ జరుగుతుందని భావించినప్పుడే అవి కూడా భయంతో కాటు వేస్తాయి. పొలాలలో గట్ల మీద ఉండే పాములను మనుషులు తొక్కినప్పుడు కాటు వేస్తుంటాయి. అన్ని పాములు విషసర్పాలు కావని, కొన్ని విషం లేనివి కూడా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఒక రకంగా పాములు పొలాలలో ఎలుకలను వధించి రైతులకు మేలు చేస్తుంటాయని అంటున్నాడు.
ప్రభుత్వం తనకు సహకరిస్తే పాములను కాపాడుతూనే ప్రజలకు మరింత సేవ చేస్తానని చెబుతున్నాడు. తనకు కావాల్సిన పరికరాలను, మరికొన్ని సదుపాయాలను కల్పించాలని కోరుతున్నాడు. విషసర్పాలను పట్టుకోవటం, వాటికి హాని కలగకుండా చూసే వాళ్లు చాలా తక్కువ. అటు పాములకు, ఇటు ప్రజలకు మేలు చేసే ఆంజనేయులు లాంటివారికి తగిని ప్రోత్సహం అందించాల్సిన అవసరం ఉందంటున్నారు పలువురు మేధవులు.