మరో అల్పపీడనం… రెండు రాష్ట్రాల్లో జోరు వానలు

వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని కూడా...

మరో అల్పపీడనం... రెండు రాష్ట్రాల్లో జోరు వానలు
Follow us

|

Updated on: Aug 24, 2020 | 10:54 AM

తెలుగు రాష్టాలను అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. గత 20 రోజులుగా వరుస అల్పపీడనం ఏర్పాడుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని గొలుసుకట్టు చెరువులు మత్తడి దూకుతున్నాయి.

అయితే వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని కూడా అధికారులు తెలిపారు. ఇటీవల ఏర్పడిన అల్పపీడనం… ప్రస్తుతం పశ్చిమ రాజస్థాన్‌ ప్రాం తంలో కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వారు ప్రకటించారు.

ఇదిలావుంటే ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని చోట్ల వ్యవసాయ క్షేత్రాలు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడే వేసిన  వరి నారు నీటిలోనే ఉండిపోయింది.