Belly Fat: రోజూ ఓ ఐదు నిమిషాలు ఈ ఆసనం వేయండి.. మీ పొట్టా ఫ్లాట్ అయిపోతుంది!

|

Feb 09, 2024 | 6:04 PM

యోగా ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. యోగాతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అంతే కాకుండా యోగా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. యోగాలో కొన్ని వందల రకాల ఆసనాలు ఉన్నాయి. దేని ఇంపార్టెంటెన్స్‌ దానికే ఉంటుంది. నిత్యం యోగాలో కొన్ని రకాల ఆసనాలు వేస్తే.. అసలు అనారోగ్య సమస్యలు దరిదాపుల్లోకే రావు. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. చాలా మంది తమ సమస్యల్ని తగ్గించుకోవడానికి యోగానే..

Belly Fat: రోజూ ఓ ఐదు నిమిషాలు ఈ ఆసనం వేయండి.. మీ పొట్టా ఫ్లాట్ అయిపోతుంది!
Belly Fat
Follow us on

యోగా ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. యోగాతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అంతే కాకుండా యోగా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. యోగాలో కొన్ని వందల రకాల ఆసనాలు ఉన్నాయి. దేని ఇంపార్టెంటెన్స్‌ దానికే ఉంటుంది. నిత్యం యోగాలో కొన్ని రకాల ఆసనాలు వేస్తే.. అసలు అనారోగ్య సమస్యలు దరిదాపుల్లోకే రావు. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. చాలా మంది తమ సమస్యల్ని తగ్గించుకోవడానికి యోగానే ఆశ్రయిస్తున్నారు. యోగాతో బాడీ కూడా ఫిట్‌గా ఉంటుంది. ఎక్కువ రోజులు జీవించేందుకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం అందరూ డెస్క్ జాబ్‌లే చేస్తున్నారు. ఇలాంటి జాబులు చేసేవారికి పొట్ట అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని తగ్గించుకునేందుకు సమయం ఉండదు. అలాంటి వారు ప్రతిరోజూ ఓ పావు గంట సేపు ఈ భుజంగం ఆసనం వేస్తే.. కొద్ది రోజుల్లోనే పొట్ట అనేది ఫ్లాట్‌గా మారిపోతుంది. ఇది వేయడం కూడా చాలా సులభమే. ఏ వయసులోని వారైనా ఈ ఆసనాన్ని ఈజీగా వేయవచ్చు. మరి దీంతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

 

ఇవి కూడా చదవండి

భుజంగ ఆసనం ఎలా వేయాలి..

ముందుగా ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత బోర్లా పడుకోండి. ఇప్పుడు చేతులపై నెమ్మదిగా ఛాతీ భాగాన్ని ఉంచుతూ పైకి లేవాలి. అనంతరం తలను పైకి ఎత్తి చూడాలి. అంటే పడగ విప్పిన పాము ఆకారంలోకి రావాలి. ఇలా ఓ ఐదు నిమిషాలు ఉండాలి. ఆ తర్వాత నార్మల్ పొజిషన్‌కి రావాలి. మరలా ఇంకో ఐదు నిమిషాలు ఉండాలి. మొదటగా ట్రై చేసేవారు కొద్ది సేపు ఉంటూ ఉండాలి. పైన చిత్రంలో చూసిన విధంగా మీ పోజ్ ఉండాలి.

భుజంగ ఆసనం ప్రయోజనాలు..

* ఈ ఆసనం వేయడం వల్ల భుజం, మెడ భాగాలు రిలాక్స్ అవుతాయి. నొప్పి వంటివి ఏమైనా ఉంటే వాటి నుంచి రిలీఫ్ నెస్ పొందుతారు.

* రోజూ కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వారికి ఈ ఆసనం బాగా ఉపయోగ పడుతుంది. వెన్ను నొప్పి నుంచి కూడా రిలీఫ్ నెస్ వస్తుంది.

* ఈ ఆసనం వేయడం వల్ల ఛాతి, పొట్ట కండరాలు ధృఢంగా మారతాయి. పొత్తి కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. నెల రోజుల పాటు ఈ ఆసనం వేస్తే పొట్ట అనేది చాలా వరకు తగ్గుతుంది.

* అయితే శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు, చేతుల్లో బాగా నొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. మిగిలివారు ఎవరైనా సరే ఈ ఆసనం వేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.