
వర్షాకాలంలో బాత్‌రూమ్, కిచెన్ సింక్, డ్రైనేజీ నాళాల నుంచి వానపాములు ఇంట్లోకి రావడం సాధారణ సమస్యగా మారుతుంది. సాధారణంగా ఇవి మట్టి సారవంతానికి మేలు చేసినప్పటికీ, ఇంట్లోని తడి ప్రాంతాల్లో సంచరించడం అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వీటిని చంపడం కంటే ఇంట్లోకి వచ్చే మార్గాలను మూసివేయడం ఉత్తమమైన పద్ధతి అని నిపుణులు సూచిస్తున్నారు.
కిచెన్ సింక్, బాత్‌రూమ్ డ్రెయిన్‌లలో ఖాళీలు లేకుండా సన్నని రంధ్రాలు ఉన్న జాలీలను అమర్చాలి. వీటివల్ల పైపుల నుంచి వానపాములు పైకి రాలేవు. అలాగే జాలీలలో వెంట్రుకలు, చెత్త చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
వానపాములు తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలకే ఆకర్షించబడతాయి. కాబట్టి బాత్‌రూమ్ ఉపయోగించిన తర్వాత నేలను పొడిగా ఉంచడం, కిచెన్ సింక్ చుట్టూ ఉన్న నీటిని వెంటనే పాయింట్‌తో తడి లేకుండా ఎప్పటికప్పుడు తుడవడం అలవాటు చేసుకోవాలి.
డ్రైనేజీ నాళాల చుట్టూ లేదా వానపాములు వచ్చే రంధ్రాల దగ్గర కొద్దిగా సాధారణ ఉప్పు చల్లడం వల్ల వాటి రాక తగ్గుతుంది. ఉప్పు లేదా వెనిగర్-నీటి మిశ్రమం ద్వారా వచ్చే ఘాటు వానపాములను దూరంగా ఉంచుతుంది.
తలుపుల కింద ఉండే ఖాళీలు, గోడల సందుల ద్వారా బయటి మట్టిలోని వానపాములు ఇంట్లోకి వస్తాయి. సిమెంట్ లేదా పుట్టీతో ఈ దారులను మూసివేయడం ద్వారా సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
యూరియా లేదా ప్రమాదకర కెమికల్స్ నాళాల్లో వేయడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ పాడయ్యే అవకాశం ఉందని, పై జాగ్రత్తలు పాటిస్తే వానపాముల బెడదను సులువుగా నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..