Teeth Whitening Tips: ఈ సింపుల్ చిట్కాలతో దంతాలను తెల్లగా మార్చుకోండి..

|

Jun 10, 2024 | 3:05 PM

ఎవరి ముఖంలో అయినా తొందరగా ఆకట్టుకునేది చిరునవ్వే. చిరునవ్వుతోనే అందరికీ దగ్గర అవుతూ ఉంటాం. కానీ నవ్వినప్పుడు దంతాలు కూడా కనిపిస్తాయి. దంతాలు ముత్యాల్లా.. తెల్లగా ఉంటే మీ నవ్వు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ పసుపు పచ్చ, నాచురంగులో ఉంటే చూసేందుకు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. దంతాలు ఇలా రంగు మారడానికి ప్రధాన కారణంగా.. దంతాలను శుభ్రంగా ఉంచుకోక పోవడమే. దంతాలను శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే..

Teeth Whitening Tips: ఈ సింపుల్ చిట్కాలతో దంతాలను తెల్లగా మార్చుకోండి..
Teeth care
Follow us on

ఎవరి ముఖంలో అయినా తొందరగా ఆకట్టుకునేది చిరునవ్వే. చిరునవ్వుతోనే అందరికీ దగ్గర అవుతూ ఉంటాం. కానీ నవ్వినప్పుడు దంతాలు కూడా కనిపిస్తాయి. దంతాలు ముత్యాల్లా.. తెల్లగా ఉంటే మీ నవ్వు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ పసుపు పచ్చ, నాచురంగులో ఉంటే చూసేందుకు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. దంతాలు ఇలా రంగు మారడానికి ప్రధాన కారణంగా.. దంతాలను శుభ్రంగా ఉంచుకోక పోవడమే. దంతాలను శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే.. పళ్లపై సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. దీంతో దంతాలపై పాకురు పేరుకుపోయి రంగు మారుతూ ఉంటాయి. అంతే కాదు కాఫీ, టీలు, సోడాలు, డ్రింక్స్ ఎక్కువగా తాగడం, పొగాకు తాగడం, మద్య పానం సేవించడం వల్ల కూడా దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతాయి. అయితే దంతాలు తెల్లగా అవడానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి.

రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి:

దంతాలు తెల్లగా ఉండాలంటే ముందు రెండు పూటలా దంతాలను శుభ్రం చేసుకోవాలి. దీంతో దంతాలపై ఉండే సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా, పాకురు పోతుంది. దీంతో దంతాలు శుభ్ర పడటమే కాకుండా రంగు కూడా మారతాయి.

లవంగాలు:

దంతాలు తెల్లగా మారడానికి లవంగాలు ఎంతో ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. కొద్దిగా లవంగా పొడిని.. ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో కలపండి. ప్రతి రోజూ ఉదయం ఈ పొడితో బ్రష్ చేయడం వల్ల దంతాలపై ఉండే పసుపు రంగు పోయి.. తెల్లగా మారతాయి. అంతే కాకుండా నోటిలో ఉండే దుర్వాసన పోయి.. నోటి ఆరోగ్యం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

తులసి:

దంతాలను తెల్లగా చేసేందుకు తులసి ఆకులు కూడా ఎంతో చక్కగా ఉపయోగ పడతాయి. తులసి ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి పళ్లపై ఉండే క్రిములు, బ్యాక్టీరియాను వెళ్లగొడతాయి. తులసి ఆకులను పొడిలా చేసి.. నిమ్మ రసంలో కలిపి పళ్లపై రుద్ది తోమితే.. దంతాలు తెల్లగా మారతాయి.

పసుపు:

దంతాల ఆరోగ్యాన్ని పెంచడంలో పసుపు కూడా చక్కగా పని చేస్తుంది. పసుపును కొబ్బరి నూనెలో కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీంతో ప్రతి రోజూ బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలపై ఉండే పసుపు రంగు పోయి.. తెల్లబడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..