వారెవ్వా.. వేపాకులా మజాకా..? ఉదయాన్నే పిడికెడు నమిలితే చాలు.. లెక్కలేనన్ని లాభాలు..!

ఉదయాన్నే వేపాకులు నమలడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా బలంగా ఉండొచ్చు. వేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే వీటిని నమలడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

వారెవ్వా.. వేపాకులా మజాకా..? ఉదయాన్నే పిడికెడు నమిలితే చాలు.. లెక్కలేనన్ని లాభాలు..!
Neem Leaves

Updated on: Jul 18, 2025 | 8:52 PM

ఉదయాన్నే వేపాకులు నమలడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్దకం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేపాకులు రక్తాన్ని శుభ్రపరచడంలో సాయపడతాయి. వేపాకులు నమలడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. రక్తం డీటాక్సిఫై అవుతుంది. ఉదయాన్నే కొన్ని వేపాకులు నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్‌తో బాధపడేవారు రెగ్యులర్‌గా వేపాకులు నమలడం మంచిది.

ఉదయాన్నే వేపాకులు నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటిలోని చెడు బ్యాక్టీరియా తొలగుతుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లు బలంగా మారుతాయి. వేపాకుల్లో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో సాయపడతాయి. వేపాకులు నమలడం వల్ల శరీరంలో మలినాలు అన్నీ తొలగుతాయి. దీంతో కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

వేపాకులు నమలడం వల్ల శరీరంలో లోపల నుంచి క్లీన్ అవుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. దీంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ఉదయాన్నే వేపాకులు నమలడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా బలంగా ఉండొచ్చు. వేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే వీటిని నమలడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us