Cold Water in Summer: వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీళ్లు తాగుతున్నారా? ఐతే ఈ చిక్కులు తప్పవ్‌

ఎండ, చెమటతో అలసిపోయిన వారికి చల్లటి నీళ్లు తక్షణ చల్లదనాన్ని, ఉపశమనాన్ని అందిస్తుంది. అందువల్ల చాలా ఇళ్లలో ఫ్రిజ్ నీళ్లు లేదా ఐస్ వాటర్ తాగేందుకు ఇష్టపడతారు. అయితే ప్రతి అలవాటు శరీరంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని మనం మర్చిపోకూడదు. చల్లటి నీళ్లు కూడా దీనికి మినహాయింపు కాదు. కొంతమందికి పదేపదే చల్లటి నీళ్లు తాగే అలవాటు..

Cold Water in Summer: వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీళ్లు తాగుతున్నారా? ఐతే ఈ చిక్కులు తప్పవ్‌
Cold Water In Summer

Updated on: Mar 29, 2026 | 1:42 PM

ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది చల్లటి నీళ్లు తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎండ, చెమటతో అలసిపోయిన వారికి చల్లటి నీళ్లు తక్షణ చల్లదనాన్ని, ఉపశమనాన్ని అందిస్తుంది. అందువల్ల చాలా ఇళ్లలో ఫ్రిజ్ నీళ్లు లేదా ఐస్ వాటర్ తాగేందుకు ఇష్టపడతారు. అయితే ప్రతి అలవాటు శరీరంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని మనం మర్చిపోకూడదు. చల్లటి నీళ్లు కూడా దీనికి మినహాయింపు కాదు. కొంతమందికి పదేపదే చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా వాతరణం వేడిగా ఉన్నప్పుడు హఠాత్తుగా చల్లటి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాల కంటే సమస్యలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు పెరగడానికి కూడా దారితీయవచ్చు. కాబట్టి చల్లటి నీరు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

చల్లటి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం చల్లటి నీళ్లు తాగడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, కడుపులో భారంగా ఉండటం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా చల్లటి నీళ్లు గొంతులో గరగర కలిగించవచ్చు. ముఖ్యంగా శరీరం వేడిగా ఉండే వేసవిలో ఇలా ఒకేసారి చల్లటి నీళ్లు తాగడం వలన శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు వస్తుంది. కొంతమందికి తలనొప్పి లేదా అలసట కూడా కలిగిస్తుంది. అంతేకాదు ఇది రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుంది. నిరంతరం చల్లటి నీళ్లు తాగే అలవాటు శరీర సహజ ప్రక్రియలను నెమ్మదింపజేస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

చల్లటి నీరు ఎవరికి మంచిది కాదు?

  • జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు చల్లటి నీళ్లు తాగకూడదు.
  • ఇది గొంతు లేదా సైనస్ సమస్యలు ఉన్నవారికి హానికరం.
  • తరచుగా జలుబు చేస్తుంటే చల్లటి నీటికి దూరంగా ఉండటం మంచిది.
  • చల్లటి నీళ్లు చిన్నపిల్లలకు, వృద్ధులకు మంచిది కాదు.
  • గుండె లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  • చల్లటి నీళ్లు తాగేటప్పుడు

పాటించవలసిన జాగ్రత్తలు

ఐస్‌ లేదా మరీ చల్లని నీళ్లు తాగడం మంచిది కాదు.
ఎండ నుంచి ఇంటికి లేదా బయటకు వచ్చిన వెంటనే చల్లని నీళ్లు తాగకూడదు. కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత నీళ్లు తాగాలి.
ఒకేసారి కాకుండా రోజంతా కొద్దికొద్దిగా నీళ్లు తాగాలి.
గొంతు నొప్పి లేదా ఇతర సమస్యలు ఉంటే చల్లటి నీళ్లు తాగవద్దు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us