Dark Circles: డార్క్ సర్కిల్స్‌‌తో ఇబ్బందిగా ఉందా.. ఇలా చేస్తే మాయం అవ్వాల్సిందే!

|

Jun 11, 2024 | 5:44 PM

లేడీస్‌ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో డార్క్ సర్కిల్స్ కూడా ఒకటి. ఈ డార్క్ సర్కిల్స్ కారణంగా.. మహిళల అందమే పోతుంది. దీంతో ముఖం అంద వికారంగా తయారవుతుంది. ఈ డార్క్ సర్కిల్స్ కళ్ల అందమే పోతుంది. ఈ సమస్య వల్ల లేడీస్ ఎంతో ఇబ్బందిగా పడతారు. నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బంది పడతారు. మరి డార్క్ సర్కిల్స్ అనేది ఎందుకు వస్తాయి? ఈ సమస్య నుంచి ఎలా బయట పడతారు? డార్క్ సర్కిల్స్..

Dark Circles: డార్క్ సర్కిల్స్‌‌తో ఇబ్బందిగా ఉందా.. ఇలా చేస్తే మాయం అవ్వాల్సిందే!
Dark Circles
Follow us on

లేడీస్‌ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో డార్క్ సర్కిల్స్ కూడా ఒకటి. ఈ డార్క్ సర్కిల్స్ కారణంగా.. మహిళల అందమే పోతుంది. దీంతో ముఖం అంద వికారంగా తయారవుతుంది. ఈ డార్క్ సర్కిల్స్ కళ్ల అందమే పోతుంది. ఈ సమస్య వల్ల లేడీస్ ఎంతో ఇబ్బందిగా పడతారు. నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బంది పడతారు. మరి డార్క్ సర్కిల్స్ అనేది ఎందుకు వస్తాయి? ఈ సమస్య నుంచి ఎలా బయట పడతారు? డార్క్ సర్కిల్స్ తగ్గించుకునేందుకు ఎలాంటి చిట్కాలు పని చేస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

డార్క్ సర్కిల్స్ రావడానికి కారణాలు:

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. డార్క్ సర్కిల్స్ రావడానికి దుమ్ము, ధూళి, అలర్జీ కారణాలు ఉంటాయి. కళ్ల దురద, వాపు, నీరు కారడం వంటి లక్షణాలు వల్ల అలర్జీలకు దారి తీస్తాయి. వేడి వాతావరణం, కంప్యూటర్, టీవీ, సెల్ ఫోన్, లాప్ టాప్ వంటి వాటి ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా ఈ డార్క్ సర్కిల్స్ వస్తాయి. డీహైడ్రేషన్ వల్ల కూడా చర్మం పొడిబారిపోయి.. రంగు మారుతుంది. సూర్య రశ్మికి ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. రక్త హీనత, పోషకాహార లోపం, కొన్ని మందులు వాడకం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి.

డార్క్ సర్కిల్స్ తగ్గించే చిట్కాలు:

* కీర డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకునేందుకు చక్కగా సహాయ పడుతుంది. కీరాను గుండ్రంగా కట్ చేసి.. రెండు కళ్లపై ఉంచండి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు ఉంచితే మంచిది.

ఇవి కూడా చదవండి

* టమాటాలతో కూడా కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. టమాటాను గుజ్జులా చేసి కళ్లపై అప్లై చేయాలి. ఇలా ఓ పది నిమిషాలు ఉంచి కట్ చేసుకోవాలి. అలాగే టమాటాను రౌండ్‌గా కట్ చేసి అయినా కళ్లపై ఉంచుకోవచ్చు.

* గ్రీన్ టీ బ్యాగులతో కూడా డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవచ్చు. తేమతో ఉన్న గ్రీన్ టీ బ్యాగులను కళ్లపై ఓ ఐదు నిమిషాలు ఉంచి తీసేయండి. ఇలా చేయడం వల్ల కళ్ల నలుపు తగ్గుతుంది.

* రెండు, మూడు రకాల ఆయిల్స్‌తో కూడా కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. బాదం, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె డార్క్ సర్కిల్స్‌‌పై మసాజ్ చేసి రాత్రంతా వదిలేయాలి. ఇలా తరచూ చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..