Health: క్యాలీఫ్లవర్‌ తింటున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

|

Oct 26, 2024 | 11:40 AM

క్యాలీఫ్లవర్ మార్కెట్లో విరివిగా లభిస్తుంటుంది. ఈ ఆకుకూర ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే లాభాలు ఉన్నాయన్నదాంట్లో ఎంత నిజం ఉందో, నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ క్యాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: క్యాలీఫ్లవర్‌ తింటున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Cauliflower
Follow us on

మార్కెట్లో నిత్యం కనిపించే కూరగాయల్లో కాలీఫ్లవర్‌ ఒకటి. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు కాలీఫ్లవర్‌లో లభిస్తాయి. కాలీఫ్లవర్‌లో విటమిన్ సి, విటమిన్ ఎతో పాటు విటమిన్‌ బి వంటి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే లాభాలు ఉన్నట్లే క్యాలీఫ్లవర్‌తో నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.? కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏయే సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాలీఫ్లవర్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి గ్యాస్ట్రిక్‌ సంబంధిత సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్‌ తీసుకోవడాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్‌ జీర్ణ సమస్యలను పెంచుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు క్యాలీ ఫ్లవర్‌ తీసుకుంటే గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి.

థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవారు కూడా క్యాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాలీఫ్లవర్ తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది ఇబ్బంది పెరగడానికి కారణమవుతుంది. కాలీఫ్లవర్ ముఖ్యంగా T3, T4 హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, థైరాయిడ్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా క్యాలీ ఫ్లవర్‌కు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గాల్‌ బ్లాడర్‌లో రాళ్లు ఉన్న వారు క్యాలీఫ్లవర్‌ తినడం ఇబ్బందికి దారి తీస్తుందని అంటున్నారు. రక్తం గడ్డకట్టే సమస్య ఉన్న వారు కూడా క్యాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని చిక్కా చేస్తుంది. గర్భిణీలు కూడా క్యాలీ ఫ్లవర్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది. సహజంగానే గర్భదారణ సమయంలో జీర్ణ సమస్యలు ఎక్కువతాయి. క్యాలీఫ్లవర్‌ తింటే ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..