Kitchen Hacks: ఫ్రిజ్‌లో నుంచి వచ్చే దుర్వాసన పోగొట్టాలంటే.. ఈ టిప్స్ బెస్ట్..

|

Aug 31, 2024 | 5:52 PM

ఎలాంటి వారెంట్లో అయినా ఫ్రిజ్ ఉండటం కామన్. ఎక్కువగా పట్టేలా కాస్త పెద్ద ఫ్రిజ్‌లనే తీసుకుంటున్నారు. ఇంట్లో ఫ్రిజ్ ఉందంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. చెప్పడం కష్టం. చాలా రకాలుగా ఫ్రిజ్ మనకు యూజ్ అవుతుంది. ఇక వీటిల్లో పనికి వచ్చినవి.. పనికి రానివి అన్నీ పెట్టేస్తున్నారు. ఇంతకు ముందు కూరలు ఏమన్నా మిగిలితే పడేయాల్సి వచ్చేది. కానీ ఫ్రిజ్ ఉండటం వల్ల అందులో పెట్టవచ్చు. పండ్లు, కూరగాయలు, పువ్వులు ఇలా ఒక్కటేంటి చాలా రకాలు..

Kitchen Hacks: ఫ్రిజ్‌లో నుంచి వచ్చే దుర్వాసన పోగొట్టాలంటే.. ఈ టిప్స్ బెస్ట్..
Fridge
Follow us on

ఎలాంటి వారెంట్లో అయినా ఫ్రిజ్ ఉండటం కామన్. ఎక్కువగా పట్టేలా కాస్త పెద్ద ఫ్రిజ్‌లనే తీసుకుంటున్నారు. ఇంట్లో ఫ్రిజ్ ఉందంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. చెప్పడం కష్టం. చాలా రకాలుగా ఫ్రిజ్ మనకు యూజ్ అవుతుంది. ఇక వీటిల్లో పనికి వచ్చినవి.. పనికి రానివి అన్నీ పెట్టేస్తున్నారు. ఇంతకు ముందు కూరలు ఏమన్నా మిగిలితే పడేయాల్సి వచ్చేది. కానీ ఫ్రిజ్ ఉండటం వల్ల అందులో పెట్టవచ్చు. పండ్లు, కూరగాయలు, పువ్వులు ఇలా ఒక్కటేంటి చాలా రకాలు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇలా ఫ్రిజ్‌లో రకరకాలు ఉండటం వల్ల ఫ్రిజ్ నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఈ వాసన కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మీ ఫ్రిజ్ నుంచి వాసన వస్తూ ఉంటే.. ఈ సారి ఈ చిట్కాలు ట్రై చేయండి. ఫ్రిజ్‌లోని బ్యాడ్ స్మెల్‌ పోతుంది. మరి ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఎక్కడి నుంచి వస్తుంది:

ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది గుర్తించాలి. వెంటనే వాటిని తొలగించండి. అలాగే ఆహార పదార్థాలు పెట్టి మర్చిపోవడం వల్ల కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కాబట్టి ముందు అవేంటో గుర్తించి.. వాటిని తొలగించండి.

నిమ్మతొక్కలతో..

కూరగాయలు, ఆహార పదార్థాలు, పువ్వులు చాలా త్వరగా కుళ్లిపోతూ ఉంటాయి. వీటి వలన ఫ్రిజ్ మొత్తం చెడు వాసన వస్తుంది. ఇలా రాకుండా ఒక చిన్న ప్లేట్ లేదా గిన్నె తీసుకోండి. అందులో నిమ్మ తొక్కలు, ఉప్పు, బేకింగ్ సోడా వేసి పెట్టండి. ఇది డియోడరైజర్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రిజ్‌లో ఏదో ఒక చోట పెట్టండి. ఫ్రిజ్ నుంచి చెడు వాసన రాకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

చార్ కోల్స్:

ఫ్రిజ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. చార్ కోల్స్ ఉపయోగించండి. ఇది ఒక చిన్న కంటైనర్‌లో ఫ్రిజ్‌లో ఉంచండి. ఇది ఫ్రిజ్‌లోని దుర్వాసనను మొత్తం గ్రహిస్తుంది. దీంతో ఫ్రిజ్ వాసన రాకుండా ఉంటుంది.

ఫ్రిజ్ క్లీన్ చేయండి:

సాధారణంగా పండుగల సమయంలో తప్ప చాలా మంది అసలు ఫ్రిజ్‌ని శుభ్రం చేయరు. అలా కాకుండా 15 రోజులకు లేదా నెలకు ఒకసారైనా ఫ్రిజ్‌ను క్లీన్ చేస్తూ ఉండండి. అన్నీ పదార్థాలు ఎక్కువగా పెట్టకుండా.. కేవలం పనికి వచ్చేవే ఉంచాలి. ఎప్పటికప్పుడు ఫ్రిజ్‌లో ఏం పెట్టాం అన్నది కూడా చూసుకుంటూ ఉండాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..