Cleaning Tips: దీపావళికి ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారా.? గోడలను ఇలా మెరిపించండి

|

Oct 27, 2024 | 9:34 AM

దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీంతో చాలా మంది తమ ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లలో మురికిగా మారిన గోడలను శుభ్రం చేసేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొన్ని నేచురల్ టిప్స్ పాటించడం ద్వారా మీ ఇల్లు తళతళమని మెరవడం ఖాయం. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Cleaning Tips: దీపావళికి ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారా.? గోడలను ఇలా మెరిపించండి
Home Cleaning
Follow us on

ఇంట్లో గోడలు మురికిగా మారడం సర్వసాధారణమైన విషయం. మరీ ముఖ్యంగా చిన్నారులు ఉన్న ఇల్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెన్నులు, పెన్సిల్స్‌తో నానా హంగామా చేస్తారు. ఇక రోడ్డు పక్కన ఉండే ఇళ్లలోకి దుమ్మూధూళి చేరి గోడలన్నీ మురికిగా మారిపోతుంటాయి. వీటిని శుభ్రం చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వచ్చ దీపావళి నేపథ్యంలో చాలా మంది ఇల్లను శుభ్రం చేసుకుంటుంటారు. మరి మురికిగా మారిన గోడలను ఎలా మెరిపించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గోడలపై చిన్నారులు గీసే గీతలను పొగొట్టడానికి టూత్‌ పేస్ట్‌నుఉపయోగించవచ్చు. గీతలు ఉన్న చోట కాస్త టూత్‌ పేస్ట్‌ను అప్లై చేయాలి. ఆ తర్వాత కాసేపయ్యాక తడి వస్త్రంతో మరకలను తుడిస్తే సరిపోతుంది. గీతలు ఇట్టే తొలగిపోతాయి. వంటసోడతో కూడా గీతలను పొగొట్టొచ్చు. ఒక గిన్నెలో చెంచా వంట సోడా తీసుకొని అందులో కాసిన్ని వాటర్ పోసి మిశ్రమంలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని గోడపై గీతలు ఉన్న చోట రాసి పాత టూత్‌ బ్రష్‌తో రుద్ది, తడి గుడ్డతో తుడిస్తే చాలు. గీతలు ఇట్టే తొలగిపోతాయి.

ఇక చాలా మంది గోడలను నీటితో కడుగుతుంటారు. అయితే ఇలా చేయకూడదని నిపుణులు అంటున్నారు. దీనివ్లల పెయింట్ పోవడంతో పాటు.. గోడలకు ఉండే పుట్టి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఏదైనా గుడ్డతో శుభ్రం చేయడమే మంచిది. గోడలపై జిడ్డు మరకలు ఉంటే వెనిగర్‌ను ఉపయోగించాలి. ఇందుకోసం ఒక గిన్నెలో కొంత వెనిగర్‌, నీటిని కలపాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని మరకలు ఉన్న చోట గుడ్డతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే జిడ్డు మరకలు ఇట్టే దూరమవుతాయి.

ఇక వంట గదిలో నూనె మరకలు కావడం సర్వసాధారణం. ముఖ్యంగా టైల్సపై పేరుకు పోయిన జిడ్డును తొలగించేందుకు సోడా, వెనిగర్‌ను ఉపయోగించాలి. ఇందుకోసం గిన్నెలో కొద్దిగా బేకింగ్​ సోడా, వెనిగర్ వేసి పేస్ట్​లాగా తయారు చేసుకోవాలి. ముందుగా.. కొన్ని నీళ్లను టైల్స్​పై చల్లుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని పోయండి. కొద్దిసేపటి తర్వాత స్క్రబర్‌తో రుద్దాలి. చివరిగా నీటితో కడిగేస్తే సరిపోతుంది. టైల్స్‌ కొత్తవాటిలో మెరిసిపోతాయి. ఇక గోడలపై ఏవైనా మరకలు ఉంటే.. లిక్విడ్‌ డిష్‌వాషర్‌ కూడా సహాయపడుతుంది. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్​లో కొద్దిగా లిక్విడ్‌ డిష్‌వాషర్‌ పోసుకొని గోడలపై మరకలు ఉన్న చల్లాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిలో క్లాత్‌ను ముంచి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..