Cholesterol in Men’s: మగవారిలో ఉండే కొలెస్ట్రాల్‌ లక్షణాలు ఇవే.. జాగ్రత్తగా ఉండాల్సిందే!

|

May 14, 2024 | 12:58 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. కొలెస్ట్రాల్ బాగా పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక బరువు, బీపీ, షుగర్, గుండె సమస్యలు వంటివి వస్తున్నాయి. సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అయితే ఈ లక్షణాలు అనేవి మగవారిలో వేరుగా ఉంటాయని పరిశోధకులు..

Cholesterol in Mens: మగవారిలో ఉండే కొలెస్ట్రాల్‌ లక్షణాలు ఇవే.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
Cholesterol In Men's
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. కొలెస్ట్రాల్ బాగా పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక బరువు, బీపీ, షుగర్, గుండె సమస్యలు వంటివి వస్తున్నాయి. సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అయితే ఈ లక్షణాలు అనేవి మగవారిలో వేరుగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ హెచ్డీఎల్ అయితే.. మరొకటి చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్. కొలెస్ట్రాల్ లెవల్స్ అనేది.. ఆడవారిలో వేరుగా, మగవారిలో వేరుగా కనిపిస్తాయట. కొన్ని లక్షణాల ద్వారా మగవారిలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కాళ్లు, చేతులు మొద్దుబారిపోతాయి:

మగవారి శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి పెరిగిపోయినప్పుడు రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు అనేవి ఏర్పడతాయి. అంతే కాకుండా నొప్పులు కూడా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా కాళ్లు మొద్దుబారిపోతూ ుంటాయి. కాళ్లల్లో బలహీనత కూడా కనిపిస్తుంది.

శ్వాస సంబంధిత సమస్యలు:

హై కొలెస్ట్రాల్‌తో బాధ పడే మగవారిలో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇది హార్ట్ ఫెయిల్యూర్‌కు కూడా దారి తీయవచ్చు. ఎందుకంటే ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి.. హార్ట్ ఎటాక్ వంటి స్ట్రోక్ వంటివి వస్తాయి. పడుకున్నప్పుడు, ఏదైనా ఫిజికల్ ఎక్సర్ సైజ్ చేసినప్పుడు ఈ లక్షణం మగవారిలో కనిపిస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గ్జాంథెలాస్మ:

మగవారి శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఈ లక్షణం కూడా కనిపిస్తుంది. ఇది కంటి వద్ద కనిపించే లక్షణం. ముక్కు వద్ద కూడా కొంత మందిలో కనిపిస్తుంది. కంటి వద్ద పచ్చ రంగులో ఉంటుంది.

ఛాతి నొప్పి:

శరీరంలో ఎల్డీఎల్ లెవల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతే.. ఛాతీలో నొప్పికి దారి తీస్తుంది. ధమనుల్లో కొవ్వు పేరుకు పోవడం వల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. గుండెకు జరిగే రక్త సరఫరాలో అడ్డుగా ఫలకాలు వస్తే.. ఇలా ఛాతినొప్పి, ఎంజినాకు దారి తీస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..