Lifestyle: మెజారిటీలో కనిపిస్తోన్న కామన్ సమస్య.. ఈ లక్షణాలు కనిపిస్తే మెగ్నీషియం లోపం ఉన్నట్లే

|

Oct 17, 2024 | 1:43 PM

రోజూ పురుషులకు 400 మి.గ్రా., మహిళలకు 300 మి.గ్రా. మెగ్నీషియం అవసరమవుతుంది. అయితే శరీరానికి తగినంత మెగ్నీషియం అందకపోతే, పలు సమస్యలకు దారితీస్తుంది. ఇంతకీ శరీరంలో మెగ్నీషియం తగ్గిన విషయాన్ని ఎలా తెలుసుకోవాలి.? మెగ్నీషియం లోపాన్ని జయించడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: మెజారిటీలో కనిపిస్తోన్న కామన్ సమస్య.. ఈ లక్షణాలు కనిపిస్తే మెగ్నీషియం లోపం ఉన్నట్లే
Magnesium
Follow us on

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తున్న సాధారణ సమస్య మెగ్నీషియం లోపం. మనిషి శరీరంలో కీలక పాత్ర పోషించే మెగ్నీషియం తగ్గడం వల్ల ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రోజూ పురుషులకు 400 మి.గ్రా., మహిళలకు 300 మి.గ్రా. మెగ్నీషియం అవసరమవుతుంది. అయితే శరీరానికి తగినంత మెగ్నీషియం అందకపోతే, పలు సమస్యలకు దారితీస్తుంది. ఇంతకీ శరీరంలో మెగ్నీషియం తగ్గిన విషయాన్ని ఎలా తెలుసుకోవాలి.? మెగ్నీషియం లోపాన్ని జయించడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కడుపులో నిత్యం వికారంగా అనిపించినా, ఏ కారణం లేకుండా ఆకలి తగ్గిన శరీరంలో తగినంత మెగ్నీషియం లేదని అర్థం చేసుకోవాలి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలైన కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటివి కనిపిస్తే శరీరంలో మెగ్నీషియం తగిన మోతాదులో లేదని అర్థం. జీనాశయం సజావుగా పనిచేయడంలో మెగ్నీషియందే కీలకపాత్ర.  శరీరంలో తగినంత మెగ్నీషియం లేకపోతే కంటి సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ల మంట, కళ్ళ నుంచి నీరు కారడం వంటి సమస్యలు కనిపిస్తాయని అంటున్నారు. నిరంతరం కండరాల నొప్పి, తిమ్మిరి వేధిస్తుంటే శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తగ్గాయని అర్థం చేసుకోవాలి.  సమస్యతో బాధపడుతున్నా తలనొప్పి, చికాకు వంటి సమస్యలున్నా శరీరంలో సరిపడా మెగ్నీషియం లేదని అర్థం చేసుకోవాలి.

ఇవి తీసుకోవాలి..

శరీరంలో మెగ్నీషియం లోపాన్ని చేయించాలంటే.. తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుమ్మడి గింజలు, పాలకూర, బచ్చలికూర, అరటిపండ్లు, నల్ల జీలకర్ర, పల్లీలు, బ్రౌన్‌ రైస్‌, సాల్మన్‌ చేపలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటితో పాటు పాలు, పెరుగు వంటి వాటిలో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..