ఇటీవల ఉదర సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జీర్ణ సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణంగా జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. దీర్ఘకాలంలో ఇవి మలబద్ధకం, వాపు వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే కడుపును మసాజ్ చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కడుపు మసాజ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్ వంటి వాటిని ఉపయోగించి కడుపును మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కడుపు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా కడపు మసాజ్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, అలాగే మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్’లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. పొత్తికడుపును మసాజ్ చేయడం ద్వారా మలబద్ధకంతో బాధపడుతున్న రోగులకు ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది దీంతో ఆ సమస్య దూరమవుతుంది.
ఇటీవల చాలా మంది ఉబ్బరం, గ్యాస్ సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలాంటి సమస్యకు కూడా మసాజ్‌తో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ మందగించడం వల్ల ఏర్పడే ఉబ్బరం, గ్యాస్ సమస్యలను మసాజ్‌తో చెక్ పెట్టొచ్చు. కాంప్లిమెంటరీ థెరపీస్ ఇన్ మెడిసిన్ జర్నల్‌లోని పరిశోధన ప్రకారం.. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS)తో బాధపడుతున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా స్టమక్ మసాజ్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు పడుకునే ముందే కడుపు మసాజ్ చేస్తే మెరుగైన నిద్ర సొంతమవుతుంది. అయితే తిన్న వెంటనే ఈ మసాజ్ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..