Lung cancer: శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు..

ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో కనిపించే ప్రాథమిక లక్షణం దగ్గు. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడుతుంటే లంగ్‌ క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలి. నెల రోజులుగా దగ్గు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఇక రక్తంతో కూడుకున్న దగ్గు మరీ ప్రమాదకరం ఇలాంటి లక్షణం కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు..

Lung cancer: శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు..
Lung Cancer
Follow us

|

Updated on: Jul 23, 2024 | 9:34 AM

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది క్యాన్సర్‌ మహమ్మారితో ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే కొన్ని లక్షణాల ద్వారా లంగ్‌ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ద్వారా సమస్య నుంచి బటయపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ లంగ్‌ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో కనిపించే ప్రాథమిక లక్షణం దగ్గు. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడుతుంటే లంగ్‌ క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలి. నెల రోజులుగా దగ్గు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఇక రక్తంతో కూడుకున్న దగ్గు మరీ ప్రమాదకరం ఇలాంటి లక్షణం కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. శ్వాస తీసుకునే సమయంలో ఛాతీలో నొప్పి రావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతంగా చెప్పొచ్చు.

వీటితో పాటు అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, గొంతులో మార్పు రావడం, ఆహారం మింగడంలో ఇబ్బంది ఉండడం కూడా లంగ్‌ క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలని చెబుతున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో గుండెలో మంట కూడా క్యాన్సర్‌కు లక్షణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గుండెలో మంటకు అసిడిటీ కారణంగా చెబుతుంటారు. కానీ ఇది కూడా లంగ్‌ క్యాన్సర్‌కు సంకేతమని అంటున్నారు. పైన తెలిపిన లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

ఇదిలా ఉంటే భవిష్యత్తులో లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్, బీడీలు వంటి వాటికి జోలికి వెళ్లకుండా ఉండాలి. అలాగే స్మోకింగ్ చేసే వారికి దగ్గరల్లో ఉండకూడదు. దీనిని పాసివ్ స్మోకింగ్ అంటారు. దీనివల్ల మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇక ఎక్కువగా తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను భాగం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాయామాలను చేయాలి. యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను చేయాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు..
శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు..
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత
సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత
ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025లో ఆ జట్టు సారథిగా సూర్య
ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025లో ఆ జట్టు సారథిగా సూర్య
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
వీళ్లసలు మనుషులేనా.. బతికుండగానే ఇద్దరు మహిళలను సజీవంగా..
వీళ్లసలు మనుషులేనా.. బతికుండగానే ఇద్దరు మహిళలను సజీవంగా..
తండ్రి పేరు చెప్పకు ఆఫర్స్ ఇవ్వరంటూ సలహాలు.. కానీ..
తండ్రి పేరు చెప్పకు ఆఫర్స్ ఇవ్వరంటూ సలహాలు.. కానీ..
4 రాష్ట్రాలలో 3 ప్రాణాంతక వైరస్‌లు
4 రాష్ట్రాలలో 3 ప్రాణాంతక వైరస్‌లు
వచ్చేశాడ్రోయ్, రికార్డుల రారాజు.. అరంగేట్రంలో సరికొత్త చరిత్ర
వచ్చేశాడ్రోయ్, రికార్డుల రారాజు.. అరంగేట్రంలో సరికొత్త చరిత్ర
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..