జీర్ణ సంబంధిత సమస్యలు దూరం చేయడంలో మిరియాలు ఉపయోగపడతాయి. గ్యాస్ట్రిక్, అజీర్తి వంటి సమస్యలు ఉన్న వారు మిరియాలను క్రమంతప్పకుండా తీసుకోవాలి.
చిగుళ్ల సమస్యకు కూడా మిరియాలు ఉపయోగపడతాయి. చిటికెడు రాతి ఉప్పులో మిరియాల పొడిని కలుపుకొని గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్ల వాపు, రక్తం సమస్యలు తగ్గుతాయి.
మిరియాలను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల రోజూ రెండు మిరియాలు నోట్లో వేసుకుంటే క్యాన్సర్ సమస్యలు దరిచేరదు. రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
మిరియాల పొడిలో బెల్లం కలిపి సాయంత్రంగా టీ రూపంలో తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. దీంతో తలనొప్పి సమస్య బలదూర్ అవుతుంది.
షుగర్ పేషెంట్స్‌కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ‘పెపరిన్’ అనే రసాయనం ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదులో ఉంటాయి.
శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్ గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా చేస్తాయి.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు మిరియాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దగ్గు, సైనసిటిస్ వంటి శ్వాసకోశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.