దేశంలోనే అతి చిన్న గ్రామం.. పురుషుల కంటే మహిళలే ఎక్కువ!
TV9 Telugu
22 July 2024
భారతదేశ జనాభాలో 70 శాతానికి పైగా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గ్రామాల్లో నివసించే ప్రజలు తమ సంస్కృతిని నిలుపుకుంటారు.
దేశంలో 6 లక్షలకు పైగా గ్రామాలు ఉండగా వేలాది గ్రామాలు ప్రసిద్ధి చెందాయి. అతి చిన్న గ్రామం ఏ రాష్ట్రంలో ఉందో మీకు తెలుసా?
భారతదేశంలోని అతి చిన్న గ్రామం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ గ్రామం కురుంగ్ కుమేయా జిల్లాలో ఉంది.
కురుంగ్ కుమే జిల్లాలోని లాంగ్డింగ్ కోలింగ్ సర్కిల్‌లోని 'హా' గ్రామం భారతదేశంలోనే అతి చిన్న గ్రామంగా ఉంది.
2011లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం 'హ' గ్రామంలో 58 కుటుంబాలు నివసిస్తున్నట్లు నివేదికల్లో నమోదయ్యాయి.
'హ' గ్రామంలో మొత్తం జనాభా 289 ఉన్నారు. వీరిలో 138 మంది పురుషులు ఉండగా.. 151 మంది మహిళలు ఉన్నట్లు తేలింది.
గ్రామ అక్షరాస్యత గురించి చెప్పాలంటే, ఇక్కడ 31.60 శాతం మంది విద్యావంతులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
పురుషుల అక్షరాస్యత శాతం 31.63% కాగా, స్త్రీల అక్షరాస్యత 31.58% ఉందని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి