22 July  2024

ఆయుర్వేదంతో..  మెదడు ఆరోగ్యం పదిలం. 

Narender.Vaitla

మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించడలో ఆయుర్వేద మూలికలు ఉపయోగపడతాయి. ఆహారం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిందే. అయితే ఆయుర్వేద మూలికలు సైతం మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

మెదడుకు మంచి చేయడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. పసుపులోని కర్కుమిన్‌ వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది.

బ్రాహ్మి మెుక్క మెదడుకు మేతలా పనిచేస్తుంది. ముఖ్యంగా అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరం చేయడంలో ఈ మొక్క కీలక పాత్ర పోషిస్తుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళనను దూరం చేయడంలో అశ్వగంధ ముఖ్యపాత్ర పోషిస్తుంది. మానసిక స్పష్టత, ఏకాగ్రత, చురుకుదనాన్ని మెరుగుపరచడంలో అశ్వగంధ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 

శంఖపుష్పి సైతం మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు, అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. 

సెంటెల్లా ఆసియాటికా దీనినే మనం సరస్వతి ఆకుగా చెబుతుంటాం. ఈ ఆకును తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రతను పెంచడంలో ఈ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.