చిన్నారులు తినడానికి మారాం చేస్తుంటారు. దీంతో సరైన పోషకాలు లభించక పోషకాహారలోపంతో ఇబ్బంది పడుతుంటారు. అదే విధంగా తక్కువ బరువుతో కూడా బాధపడుతుంటారు. భారత్‌లో చాలా మంది చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే చిన్నారుల్లో ఈ సమస్యను దూరం చేయాలంటే వారికిచ్చే ఆహారంలో కొన్ని పదార్థాలను భాగం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్నారులకు కచ్చితంగా అందించాల్సిన ఆహార పదార్థాల్లో అరటిపండు ప్రధానమైంది. అరటి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులోని కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు పిల్లల్లో బరువు పెరగడానికి సాహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పాలలో అరటి పండు ముక్కలను వేసి చిన్నారులకు అందిస్తే మార్పు చాలా త్వరగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇక పిల్లలకు సరైన పోషణ లభించాలన్నా, త్వరగా బరువు పెరాగాలన్నా పండ్లను ఆహారంలో భాగం చేయాలి. ముఖ్యంగా అరటి, యాపిల్, బొప్పాయి, మామిడి వంటి పండ్లను ఇవ్వాలి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శిశువు ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. ఫైబర్ కంటెంట్ ఉండే పండ్లను తీసుకోవడం వల్ల చిన్నారులకు త్వరగా జీర్ణమవ్వడంతో పాటు ప్రోటీన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది పిల్లలు బరువు పెరగడానికి తోడ్పడుతుంది.
ఇక చిన్నారులకు రకరకాల పప్పులతో చేసే కిచిడీ కూడా ఎంతో తోడ్పడుతుంది. పప్పులతో అన్నం రడీ చేసి పెడితే చిన్నారులకు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అదే విధంగా బరువు పెరగడంలో ఉపయోగపడుతుంది. ఇక ఇడ్లీలో వివిధ రకాల కూరయాలు కలిపి చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇడ్లీ పిండిలో క్యారెట్, బచ్చలికూర వంటివి కలిపి చేస్తే పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇడ్లీకి రుచి రావడంతో పాటు పోషకాలు లభిస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి…