Health: ఈ బ్లడ్ గ్రూప్‌ వారు.. నాన్‌ వెజ్‌కి దూరంగా ఉండడమే బెటర్‌

|

Oct 06, 2024 | 4:29 PM

వారంలో ఒక్కరోజైనా కచ్చితంగా నాన్‌ వెజ్‌ తినాల్సిందే. ఆదివారం ముక్క లేనిది ముద్ద దిగని వారు మనలో చాలా మంది ఉంటారు. రకరకాల నాన్‌ వెజ్‌ వంటకాలను చేసుకొని ఇష్టంగా తింటుంటారు. అయితే నాన్‌వెజ్‌తో లాభాలు ఉన్నాయన్న దాంట్లో నిజం ఉన్నట్లే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా శరీరంలో కొవ్వు...

Health: ఈ బ్లడ్ గ్రూప్‌ వారు.. నాన్‌ వెజ్‌కి దూరంగా ఉండడమే బెటర్‌
Non Veg
Follow us on

వారంలో ఒక్కరోజైనా కచ్చితంగా నాన్‌ వెజ్‌ తినాల్సిందే. ఆదివారం ముక్క లేనిది ముద్ద దిగని వారు మనలో చాలా మంది ఉంటారు. రకరకాల నాన్‌ వెజ్‌ వంటకాలను చేసుకొని ఇష్టంగా తింటుంటారు. అయితే నాన్‌వెజ్‌తో లాభాలు ఉన్నాయన్న దాంట్లో నిజం ఉన్నట్లే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా శరీరంలో కొవ్వు పెరగడానికి, అధిక బరువుకు నాన్‌ వెజ్‌ దారి తీస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు నాన్‌ వెజ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.

ఇదిలా ఉంటే కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్‌ వారు నాన్‌ వెజ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం అన్ని రకాల వ్యక్తులకు నాన్‌ వెజ్‌ అంత సులభంగా జీర్ణమవ్వదు. ఈ కారణంగా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తీసుకున్న ఆహారం జీర్ణమవ్వడం అనేది మన బ్లడ్‌ గ్రూప్‌పై ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతారు. వేరు వేరు బ్లడ్‌ గ్రూప్‌లోని వ్యక్తుల్లో వేరు వేరు జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. ఇంతకీ ఏ బ్లడ్ గ్రూప్‌ ఉన్న వారు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిలో తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవ్వదు. కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్‌ వారు మాంసాన్ని తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌, మటన్‌కు బదులుగా చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని అంటున్నారు.

* బీ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారికి జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. వీరు ఎలాంటి జంకు లేకుండా నాన్‌ వెజ్‌ను తీసుకోవచ్చు. చికెన్‌, మటన్‌ వంటి ఏ మాంసాహారమైన హాయిగా తినొచ్చు. అయితే ఈ బ్లడ్ గ్రూప్‌ వారికి ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* ‘ఏబీ’, ‘ఓ’ గ్రూప్‌ల వ్యక్తులు తీసుకునే ఆహారంలో సమతుల్యతను కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరు తీసుకునే ఆహారం విషయంలో ఆంక్షలు ఏమి లేకపోయినా.. మటన్‌, చికెన్‌ మాత్రం కాస్త తక్కువ మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆకుకూరలు, చేపలను తీసుకుంటే వీరికి మేలు జరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..