కుంకుమ పువ్వుతో గుండెపోటుకు చెక్..!

| Edited By:

Aug 07, 2019 | 12:05 PM

కుంకుమ పువ్వు ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు. గర్భిణులకు ఎక్కువగా ఈ కుంకుమ పువ్వును పాలల్లో కలిపి ఇస్తారు. కుంకుమ పువ్వును గర్భిణులు ఆహారంలో తీసుకుంటే పుట్టే.. బిడ్డ నల్లగానో.. ఛామనఛాయతోనో కాక తెల్లగా పుడతారని ఓ వార్త ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే.. ఇది సరికాదని.. కుంకుమ పువ్వు బిడ్డ రంగును మార్చడంలో ఏ ప్రభావం ఉండదని వైద్యులు తెలిపారు. అయితే.. ఆరోగ్యంగా […]

కుంకుమ పువ్వుతో గుండెపోటుకు చెక్..!
Follow us on

కుంకుమ పువ్వు ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు. గర్భిణులకు ఎక్కువగా ఈ కుంకుమ పువ్వును పాలల్లో కలిపి ఇస్తారు. కుంకుమ పువ్వును గర్భిణులు ఆహారంలో తీసుకుంటే పుట్టే.. బిడ్డ నల్లగానో.. ఛామనఛాయతోనో కాక తెల్లగా పుడతారని ఓ వార్త ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే.. ఇది సరికాదని.. కుంకుమ పువ్వు బిడ్డ రంగును మార్చడంలో ఏ ప్రభావం ఉండదని వైద్యులు తెలిపారు. అయితే.. ఆరోగ్యంగా ఉంటుందనే కారణంగానే డాక్టర్లు దీన్ని రిఫర్ చేస్తారని పరిశోధనలో తేలింది.

కాగా.. కుంకుమ పువ్వు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవి:

1. క్యాన్సర్ రాకుండా చేస్తుంది
2. ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది
3. కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గిస్తుంది
4. రక్తంలోని కొలస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది
5. గుండెపోటు రాకుండా చేస్తుంది
6. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
7. కుంకుమ పువ్వును పలు ఆయుర్వేద చికిత్సల్లో కూడా ఉపయోగిస్తారు.
8. చర్మ సంబంధిత మందులలో కూడా కుంకుమపువ్వును విరివిగా ఉపయోగిస్తారు.