Rosemary Vs Onion Oil: మీ కురులు పట్టుకుచ్చులా పెరిగేందుకు ఈ నూనె వాడండి.. నెల రోజుల్లోనే మ్యాజిక్‌

కొన్ని పరిశోధనలలో ఉల్లి జుట్టు పెరుగుదల చికిత్సకు సైతం ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. ఉల్లి నూనెలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది తల చర్మానికి పోషణ అందించి, దెబ్బతిన్న జుట్టును బాగు చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడం, చుండ్రు లేదా బలహీనమైన జుట్టు వంటి సమస్యలు ఉంటే ఈ నూనె చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, దీనికి కొద్దిగా ఘాటైన వాసన ఉంటుంది. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. జుట్టు పెరుగుదల, తల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి రోజ్మేరీ నూనె మంచి ఎంపిక..

Rosemary Vs Onion Oil: మీ కురులు పట్టుకుచ్చులా పెరిగేందుకు ఈ నూనె వాడండి.. నెల రోజుల్లోనే మ్యాజిక్‌
Hair Growth Oil

Updated on: Mar 26, 2026 | 1:08 PM

అపురూపంగా చూసుకునే కురులు అకారణంగా రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. అయితే నేటి కాలంలో జుట్టు రాలడం, పలచబడటం, పెరుగుదల కుంటుపడటం సర్వసాధారణ సమస్యలుగా మారాయి. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల ప్రభావం జుట్టుపై కనిపిస్తుంది. దీంతో చాలా మంది ఖరీదైన రసాయన ఉత్పత్తులకు బదులుగా సహజ చికిత్సల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రోజ్‌మేరీ నూనె, ఉల్లి నూనెతో తయారు చేసిన హెయిర్‌ప్యాక్‌ కురులకు పోషకాలు అందించడమేకాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. రోజ్‌మేరీ నూనె అనేది ఒక హెర్బల్ ఎసెన్షియల్ ఆయిల్. ఇది తల చర్మంలో రక్త ప్రసరణను పెంచడానికి పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లకు బాగా పోషణ అందించి, జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడం,పలచబడటం వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ నూనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

అదే జుట్టు బలహీనంగా ఉండి, చిట్లి పోతుంటే ఉల్లిపాయ నూనె మరింత ప్రభావవంతంగా ఉంటుంది. రోజ్మేరీ నూనెను ఎల్లప్పుడూ కొబ్బరి లేదా బాదం నూనె వంటి క్యారియర్ ఆయిల్‌తో కలిపి వినియోగించాలి. దీనిని వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించడం మంచిది. ఉల్లి నూనెను తలపై సున్నితంగా మర్దనా చేసి 1 నుంచి 2 గంటల తర్వాత తల స్నానం చేయాలి. క్రమం తప్పకుండా దీనిని వాడటం మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే.. ఏ నూనెను ఉపయోగించే ముందు అయినా తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. తల చర్మం సున్నితంగా ఉన్నా లేదా అలర్జీలు ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఉల్లిలోని పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. జుట్టు పెరుగుదలకు సల్ఫర్ ముఖ్యమైన పోషకం. ఇది జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఉల్లి నూనె తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది. ఉల్లి నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది తల చర్మం ఇన్ఫెక్షన్లను తగ్గించి, చుండ్రును అదుపులో ఉంచుతుంది.

చుండ్రు తగ్గినప్పుడు, జుట్టు రాలడం కూడా దానంతట అదే తగ్గుతుంది. ఈ నూనె జుట్టుకు సహజమైన మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది. పొడిబారిన, కాంతిహీనమైన జుట్టును మెరుగుపరచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం అలోపేసియా ఏరియాటా సమస్య విషయంలో ఉల్లి రసం లేదా నూనెను ఉపయోగించడం కూడా కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లినూనెను వారానికి 2-3 సార్లు తలకు పట్టింటి, సున్నితంగా మర్దన చేయాలి. దీనిని 30-45 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి. క్రమం తప్పకుండా వాడటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొంతమందికి ఉల్లి అలెర్జీ ఉండవచ్చు. కాబట్టి దీనిని ఉపయోగించే ముందు చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఇది కళ్లలో పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us