Snoring Problem: ఈ చిన్న చిట్కాలతో గురకను శాశ్వతంగా తగ్గించుకోండి..

|

Sep 01, 2024 | 1:54 PM

గురక గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న వారి నుంచి పెద్ద వారిలో కూడా ఈ గురక అనేది వస్తుంది. ఈ గురక వస్తుందన్న విషయం కూడా నిద్ర పోయే వారికి తెలీదు. కానీ గురక వల్ల పక్క వారికి మాత్రం అస్సలు అస్సలు నిద్ర పట్టదు. ఈ గురక సమస్యను మాత్రం కేవలం చిన్న సమస్యే అనుకుంటే మాత్రం నిజంగా పొరపాటే. గురక సమస్యను సత్వరమే పరిష్కరించుకోవాలి. లేదంటే మాత్రం గుండె జబ్బులు కూడా వస్తాయి. ఈ గురక రావడానికి చాలా రకాల..

Snoring Problem: ఈ చిన్న చిట్కాలతో గురకను శాశ్వతంగా తగ్గించుకోండి..
Snoring Problem
Follow us on

గురక గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న వారి నుంచి పెద్ద వారిలో కూడా ఈ గురక అనేది వస్తుంది. ఈ గురక వస్తుందన్న విషయం కూడా నిద్ర పోయే వారికి తెలీదు. కానీ గురక వల్ల పక్క వారికి మాత్రం అస్సలు అస్సలు నిద్ర పట్టదు. ఈ గురక సమస్యను మాత్రం కేవలం చిన్న సమస్యే అనుకుంటే మాత్రం నిజంగా పొరపాటే. గురక సమస్యను సత్వరమే పరిష్కరించుకోవాలి. లేదంటే మాత్రం గుండె జబ్బులు కూడా వస్తాయి. ఈ గురక రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఏవి పడితే ఆ ఆహారం తినడం వల్ల కూడా గురక అనేది వస్తుంది. నిద్ర సరిగా లేకపోయినా, శ్వాస నాళాల్లో సమస్యలు ఉన్నా కూడా గురకతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

అలాగే గురక పెట్టే విధానం వల్ల కూడా సమస్యలను గుర్తించవచ్చు. నోరు తెరిచి గురక పెడుతూ నిద్ర పోతే.. గొంతులోని మృదువైన కణజాలాల్లో సమస్య ఉందని గ్రహించాలి. నోరు మూసుకుని గురక పెడితే మాత్రం నాలుకలో సమస్య ఉందని చెప్పొచ్చు. ఈ గురక సమస్యను తగ్గించడానికి చాలా రకాల చిట్కాలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాణాయామం:

ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస క్రియపై పట్టు అనేది పెరుగుతుంది. ఇది చేయడం వల్ల ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. ప్రాణాయామంతో కేవలం గురక మాత్రమే కాకుండా నిద్ర సమస్యలు కూడా దూరమవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

స్మోకింగ్:

చాలా మందికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. పొగ తాగేవారిలో ఎక్కువగా ఈ గురక అనేది వస్తుంది. పొగ తాగడం వల్ల శ్వాస అనేది సరిగా ఆడదు. ఊపరి తిత్తులు పాడవుతాయి. కాబట్టి స్మోకింగ్ చేయడం మానేయండి.

దిండు:

దిండుతో కూడా గురక సమస్యను తగ్గించుకోవచ్చు. గురక పెట్టేవారు దిండును ఉంచుకోండి. మరీ ఎత్తు కాకుండా మరీ పలుచగా ఉండకుండా తలగడను పెట్టండి. దీని వలన గురక సమస్య కొంత వరకు తగ్గించవచ్చు.

పసుపు పాలు:

గురకతో బాధ పడేవారు రాత్రి పూట నిద్రించే సమయంలో పసుపు కలిపిన గోరు వెచ్చటి పాలు తాగండి. ఇది గొంతులోని చికాకును తగ్గించి.. గురక రాకుండా ఆపుతుంది. రోజూ తాగితే వేడి చేస్తుంది. కాబట్టి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తాగుతూ ఉండండి. పసుపు పాలతో నిద్ర కూడా చక్కగా పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..