తలనొప్పి పెద్దల్లో సర్వసాధారణంగా కనిపించే సమస్య. కాస్త ఒత్తిడి పెరిగినా, నిద్రలేమితో ఉన్నా వెంటనే తలనొప్పి వేధిస్తుంటుంది. అయితే చిన్నారుల్లోనూ ఇటీవల తలనొప్పి సమస్యల ఎక్కువుతోంది. కానీ చిన్నారుల్లో తలనొప్పి అనగానే పెద్ద సీరియస్‌గా తీసుకోరు. కానీ చిన్నారుల్లో తలనొప్పి సమస్యను లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
చిన్న పిల్లలో తలనొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అనారోగ్యం కారణంగా, జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్ లేదా ఫ్లూ కారణంగా పిల్లలు తలనొప్పిని వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. సరైన సమయంలో భోజనం చేయకపోయినా, చాక్లెట్, చీజ్, కెఫిన్ వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకున్నా కొందరు చిన్నారుల్లో తలనొప్పి సమస్య వస్తుంది.
ఇదిలా ఉంటే ఇటీవల స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరుగుతోంది. విపరీతమైన స్మార్ట్‌ఫోన్ వినియోగం కూడా తలనొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి వస్తూ వికారం, వంతులు, నొప్పి, మైకం, కడుపు నొప్పి భావన ఉంటే మైగ్రేన్ సమస్యగా భావించాలి. అయితే చిన్నారుల్లో తలనొప్పిని లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వారంలో మూడుసార్లకు మించి ఎక్కువగా తలనొప్పి సమస్య ఉందుంటూ ఫిర్యాదు చేస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సంబంధిత వైద్య పరీక్షలను చేయించాలి.
ఇక చిన్నారుల్లో తలనొప్పి తగ్గించేందుకు కొన్ని రకాల సహజ పద్ధతులను కూడా పాటించవచ్చు. ముఖ్యంగా పిల్లలకు సరిపడ నిద్ర ఉండేలా చూసుకోవాలి. సమయానికి భోజనం అందించాలి. అలాగే స్మార్ట్ ఫోన్, టీవీ వంటి వాటిని తగ్గించాలి. అవుట్ డోర్ గేమ్స్‌ను అలవాటు చేయాలి. ఇక కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ కారణంగా కూడా తలనొప్పి వస్తుందని వైద్యులు అంటున్నారు. అందుకే హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. నొప్పి మరీ ఎక్కువైతే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..