AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentines Week: అయ్యబాబోయ్.. కౌగిలింతతో ఇన్ని లాభాలా? ‘హగ్ డే’ నాడు ఒక్కసారి హగ్ చేసుకుంటే మీ గుండె పదిలం!

వాలెంటైన్స్ వీక్‌లో ఐదవ రోజైన ఫిబ్రవరి 11ను 'ప్రామిస్ డే'గా జరుపుకుంటారు. ప్రేమ బంధానికి పునాది నమ్మకం అయితే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేది ఒకరికొకరు ఇచ్చుకునే మాట. ప్రామిస్ డే సందర్భంగా తమ భాగస్వామికి జీవితాంతం తోడుంటామని, కష్టసుఖాల్లో అండగా నిలుస్తామని వాగ్దానం చేస్తారు. కేవలం మాటలు చెప్పడమే కాదు, వాటిని నిలబెట్టుకోవడమే ఈ రోజు అసలు ఉద్దేశ్యం.

Valentines Week: అయ్యబాబోయ్.. కౌగిలింతతో ఇన్ని లాభాలా? 'హగ్ డే' నాడు ఒక్కసారి హగ్ చేసుకుంటే మీ గుండె పదిలం!
Promise Day 2026 Date
Bhavani
|

Updated on: Feb 12, 2026 | 12:00 PM

Share

ప్రామిస్ డే ముగిసిన వెంటనే ఫిబ్రవరి 12న వచ్చేదే ‘హగ్ డే’. మాటలతో చెప్పలేని ఎన్నో భావాలను ఒక చిన్న కౌగిలింతతో చెప్పవచ్చు. హగ్ డే ప్రాముఖ్యత కేవలం ప్రేమకు మాత్రమే పరిమితం కాదు, దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఈ రెండు రోజుల ప్రత్యేకతలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రామిస్ డే :

చరిత్ర, ప్రాముఖ్యత:

ప్రామిస్ డేకి ప్రత్యేకమైన చారిత్రక మూలాలు లేనప్పటికీ, వాలెంటైన్స్ వీక్‌లో ఇది అత్యంత కీలకమైన రోజుగా మారింది. బహుమతులు, చాక్లెట్ల కంటే ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని ఈ రోజు పునరుద్ఘాటిస్తారు.

ఎలా జరుపుకోవాలి?:

మీ భాగస్వామికి హృదయపూర్వకమైన ప్రేమ లేఖలు రాయడం లేదా ఒక స్పెషల్ డేట్ ప్లాన్ చేసి మీ మనసులోని మాటను ‘ప్రామిస్’ రూపంలో చెప్పడం ద్వారా ఈ రోజును గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు.

హగ్ డే :

శాస్త్రీయ కారణం: మనం ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు శరీరంలో ‘ఆక్సిటోసిన్’ (Oxytocin) అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనిని ‘కౌగిలింత హార్మోన్’ అని కూడా పిలుస్తారు. ఇది రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఒత్తిడిని మాయం చేస్తుంది.

కౌగిలింత రకాలు:

బేర్ హగ్ : గట్టిగా హత్తుకోవడం, ఇది భద్రతను సూచిస్తుంది.

సైడ్ హగ్ : స్నేహపూర్వక మద్దతుకు గుర్తు.

బ్యాక్ హగ్ : ఇది రక్షణ ప్రేమానురాగాలకు సంకేతం.

ప్రాముఖ్యత: 1986లో కెవిన్ జాబోర్నీ అనే వ్యక్తి మొదటగా ఈ కౌగిలింతల దినోత్సవ ఆలోచనను ముందుకు తెచ్చారు. అప్పటి నుండి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.