Pranayama: శీతాకాలంలో వచ్చే సమస్యలకు ప్రాణాయామంతో చెక్.. సింపుల్ టెక్నిక్స్ మీరూ ట్రై చేయండి

| Edited By: Anil kumar poka

Jan 10, 2023 | 1:53 PM

చలి నేపథ్యంలో వ్యాయామం చేయకపోవడంతో విపరీతంగా బరువు పెరుగుతారు. అలాగే చాలా మంది చర్మ సమస్యలకు గురవుతారు. అంటు వ్యాధులు ముఖ్యంగా జలుబు, దగ్గుతో సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో చలికాలంలో వచ్చే సమస్యలకు ప్రాణాయామం ద్వారా చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ నిర్ధిష్ట సమయంలో ప్రాణాయామం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు.

Pranayama: శీతాకాలంలో వచ్చే సమస్యలకు ప్రాణాయామంతో చెక్.. సింపుల్ టెక్నిక్స్ మీరూ ట్రై చేయండి
Pranayama For Asthma
Follow us on

ప్రస్తుతం మన తెలుగురాష్ట్రాల్లో చలి ప్రతాపం చూపిస్తుంది. ఎప్పుడూ చూడనంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి పెరుగుతుంది అంటే వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది చలికాలంలో వివిధ వ్యాధులకు గురవుతారు. అలాగే డైటింగ్ చేసే వారికైతే చలి కాలంలోనే పెద్ద టాస్క్ మొదలవుతుంది. చలి నేపథ్యంలో వ్యాయామం చేయకపోవడంతో విపరీతంగా బరువు పెరుగుతారు. అలాగే చాలా మంది చర్మ సమస్యలకు గురవుతారు. అంటు వ్యాధులు ముఖ్యంగా జలుబు, దగ్గుతో సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో చలికాలంలో వచ్చే సమస్యలకు ప్రాణాయామం ద్వారా చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ నిర్ధిష్ట సమయంలో ప్రాణాయామం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. నిపుణులు చెప్పే ప్రాణాయామం టెక్నిక్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ప్రాణాయామంలో ముఖ్యంగా వివిధ అభ్యాసాలు రోజూ చేస్తే ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకునే స్థాయి పెరుగుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరిగితే ఆటోమెటిక్ గా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బరువు తగ్గడంలో, చర్మ సంరక్షణకు ప్రాణాయామం సూపర్ ఇంజిన్ లా పని చేస్తుంది.  అయితే ప్రాణాయామం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ప్రాణాయామంలో పొజిషన్, స్పీడ్ కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ప్రాణాయామం చేసే సమయంలో తూర్పు వైపునకు తిరిగి కూర్చోవడం ఉత్తమం. అలాగే తరచూ ప్రాణాయామం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ఒత్తిడి సమస్య నుంచి ఇట్టే బయటపడవచ్చు.

ప్రాణాయామ వేగం

మొదటి సారి ప్రాణాయామం చేసేటప్పుడు శాంత్ గతితో ప్రారంభించి మధ్యమం తర్వాత తివ్రగామికి చేరుకోవాలి. ప్రాణాయామం చేసే సమయంలో మొదట్లో ఊపిరి స్లో గా తీసుకుని..తర్వాత వేగం పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రాణాయామ భంగిమ

ప్రాణాయామం చేసే సమయంలో ఎలా కూర్చొని ప్రాణాయామం చేస్తున్నామో? అనే విషయం ముఖ్యం. సుఖాసనం, అర్ధ పద్మాసనం, వజ్రాసనం, పూర్ణ పద్మాసనం వంటి సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవాలి. కూర్చొన్న సమయంలో వీపును నిటారుగా ఉంచాలి. భుజాలు కదపకుండా కళ్లు మూసుకుని శ్వాసపై ధ్యాసను కేంద్రీకరించాలి.

ఉద్గీత్ ప్రాణాయామం

ముందుగా కరెక్ట్ పొజిషన్ లో కూర్చోవాలి. వీలైనంత మేర గాలిని పీల్చుకోవాలి. అలా కాసేపు ఉంచుకున్న తర్వాత శ్వాసను వదిలే సమయంలో ఓం అంటూ గాలిని మొత్తం నోటి ద్వారా వదిలేయాలి. 

ఖండ్ ప్రాణాయామం

ఈ ప్రాణాయామంలో మనం పీల్చుకునే గాలిని రెండు భాగాలుగా విభజించాలి. ఊపిరితిత్తుల్లో గాలిని ఉంచకుండా రెండు సార్లు గాలిని తీసుకోవాలి.

బెలో బ్రీత్

బెలో బ్రీత్ ను ప్రయత్నించే సమయంలో సాధారణంగా ఊపిరి పీల్చుకోవాలి. చిన్నగా లయబద్ధంగా ఊపిరి తీసుకుంటూ వదిలేయాలి. కొంచెం ఇబ్బందిగా ఈ ప్రక్రియ చేయాలి. అయితే హైపర్ టెన్షన్, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, వెర్టిగో, మైగ్రేన్ తో బాధపడే వారు ఈ బెలో బ్రీత్ కు దూరంగా ఉండాలి. అలాగే ఉదర శస్త్ర చికిత్స చేయించుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాణాయామం చేయకూడదు. 

భ్రమరీ ప్రాణాయామం

ఈ ప్రాణాయాం చేసే సమయంలో ముందుగా కాసేపు శ్వాస తీసుకోవాలి. అనంతరం ముక్కు రంధ్రాన్ని వేలితో మూసేసి గాలి తీసుకోవాలి. ఆ గాలిని ఇంకో రంధ్రంతో వదిలేయాలి. ఇలా వీలైనన్ని సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.  

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం