
సాధారణంగా ఇళ్లలో భోజనం రుచిగా మారాలంటే ఏదైనా పచ్చడి పక్కన ఉండాల్సిందే. అందులోనూ పచ్చిమిర్చి తో చేసే స్పైసీ అవకాయ ఉంటే ఆ మజాయే వేరు. దాల్-చావల్, రొట్టెలు లేదా పరాటాలతో నంజుకోవడానికి ఈ పచ్చడి అద్భుతమైన ఎంపిక. పచ్చడి పెట్టాలంటే చాలామందికి రోజుల తరబడి ఎండలో పెట్టాలనే టెన్షన్ ఉంటుంది. కానీ ఎలాంటి ఎండ అవసరం లేకుండా, నిమిషాల వ్యవధిలో ఇంట్లోనే రుచికరమైన పచ్చిమిర్చి ఊరగాయను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
తాజా పచ్చిమిర్చి: 200 గ్రాములు
మసాలా దినుసులు: 6 టేబుల్ స్పూన్ల సోంపు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 చిన్న స్పూన్ జీలకర్ర, అర స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు.
ఇతర పదార్థాలు: తగినంత నూనె, పసుపు, ఇంగువ, కశ్మీరీ కారం, ఆమ్చూర్ పొడి, కొద్దిగా తెల్ల వెనిగర్, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి.
ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. ఆ తర్వాత తొడిమలు తొలగించి, పొడవుగా చీల్చి లోపల ఉన్న గింజలను కొద్దిగా తీసివేయాలి. ఇలా చేయడం వల్ల కారం కొద్దిగా తగ్గి, మసాలాలు బాగా పడతాయి. బాణలిలో సోంపు, మెంతులు, జీలకర్రను దోరగా వేయించి, సువాసన వచ్చాక వాము, ఆవాలు కూడా కలిపి వేయించాలి. అవి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి, కొద్దిగా కలోంజి, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. మిర్చి మెత్తబడిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి, ఆమ్చూర్ పొడి, కశ్మీరీ కారం, 4 చెంచాల తెల్ల వెనిగర్ వేసి బాగా కలపాలి. ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలిచొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. పైన కొద్దిగా వేడి చేసి చల్లార్చిన నూనె పోస్తే, ఫ్రిజ్‌లో ఉంచితే 3 నుండి 4 నెలల పాటు చెడిపోకుండా తాజాగా ఉంటుంది.