AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noni Fruit: సర్వరోగ నివారిణి.. ఈ ఒక్క పండుతో.. ఆ సమస్యలన్నీ ఇట్టే పరార్..

మారుతున్న జీవనశైలి కారణంగా జనాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని తగ్గించుకోవడానికి చాలా మంది ఇప్పుడు పాత ప్రకృతి పద్దతి వైపు మొగ్గుచూపుతున్నారు. అలాంటి వారికి నోని మొక్క ఇప్పుడు దివ్య ఔషదంగా మారుతోంది. ఇంతకూ ఈ నోని మొక్క అంటే ఏమిటి.. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Noni Fruit: సర్వరోగ నివారిణి.. ఈ ఒక్క పండుతో.. ఆ సమస్యలన్నీ ఇట్టే పరార్..
Noni Health Benefits
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jun 29, 2026 | 5:26 PM

Share

ఆధునిక జీవనశైలి తెచ్చిపెడుతున్న అనారోగ్య సమస్యల నడుమ మానవాళి మళ్లీ ప్రకృతి వైద్యం వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రాచీన ఆయుర్వేదంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న ఒక అద్భుత ఔషధ మొక్క ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ‘నోని’. శాస్త్రీయంగా మొరిండా సిట్రిఫోలియా అని పిలిచే ఈ మొక్కను మన తెలుగు ప్రాంతాల్లో ‘మొగలి చెట్టు’ అని, ఆంగ్లంలో ‘ఇండియన్ మల్బెరీ’ అని వ్యవహరిస్తారు. ఆగ్నేయాసియా, పసిఫిక్ దీవులతో పాటు భారతదేశ వాతావరణంలో సులువుగా పెరిగే ఈ మొక్క, మానవ శరీరానికి చేకూర్చే మేలు అంతా ఇంతా కాదని ఆయుర్వేద వైద్యనిపునులు చెబుతున్నారు.

నోని మొక్క సాధారణంగా ఒక చిన్న వృక్షంలా లేదా దట్టమైన పొదలా కనిపిస్తుంది. నిటారుగా సాగే కాండం, దట్టంగా అల్లుకుపోయే కొమ్మలతో ఈ చెట్టు సతత హరితంగా అలరారుతుంది. దీని ఆకులు పెద్దవిగా, ముదురు పచ్చ రంగులో మెరుస్తూ ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నా, నేల సారం ఎలా ఉన్నా సరే, ఉష్ణమండల పరిస్థితులకు తట్టుకుని నిలబడటం దీని ప్రత్యేకత. పల్లెల్లో, తోటల్లో కొమ్మల నిండా గుత్తులు గుత్తులుగా కాసే ఈ కాయలు ప్రాథమిక దశలో లేత పచ్చ రంగులో ఉండి, క్రమంగా పరిపక్వత చెందుతాయి. ఎదుగుతున్న కొద్దీ కాయలపై గుండ్రటి మచ్చలు, కళ్ల వంటి ఆకారాలు స్పష్టంగా గోచరిస్తాయి.

నోని పండు బాహ్య రూపం: భిన్నమైన ఆకృతి

సాధారణ పండ్లతో పోలిస్తే నోని పండు ఆకృతి కాస్త వింతగా, బంగాళాదుంపను పోలి ఉంటుంది. దీని బాహ్య చర్మంపై మురళీధరుని కనుల వంటి బుడిపెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పండు పూర్తిగా పక్వానికి వచ్చి కోతకు సిద్ధమైనప్పుడు, అది లేత పసుపు లేదా తెల్లటి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అయితే, ఈ పండు సువాసన కంటే కూడా కాస్త ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. రుచి విషయానికి వస్తే ఒకింత చేదుగా, వగరుగా అనిపించడం వల్ల చాలామంది దీనిని నేరుగా తినడానికి ఇష్టపడరు. అందువల్లే మార్కెట్లో దీనిని ఎక్కువగా జ్యూస్ రూపంలో విక్రయిస్తుంటారు.

నోని ఆరోగ్య ప్రయోజనాలు

పోషకాల గని అయిన నోని పండులో విటమిన్ సి, విటమిన్ బి3, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యంశాలతో పాటు వందలాది యాంటీఆక్సిడెంట్లు దాగి ఉన్నాయి. దీని క్రమబద్ధమైన వినియోగం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో నోని అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కణాల క్షీణతను అడ్డుకుని, సీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి. అదేవిధంగా నేటి తరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కీళ్ల నొప్పులు ఒకటి.

నోని రసం శరీరంలో ఒక సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తూ, కీళ్ల వాపులను, తీవ్రమైన నొప్పులను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే మారుతున్న కాలంలో బీపీ, షుగర్ సాధారణ సమస్యలుగా మారాయి. నోని రసాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. నోనిలోని యాంటీ-ఏజింగ్ గుణాలు చర్మంపై ముడతలను నివారించి, యవ్వనంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అంతేకాకుండా, తలలో వచ్చే ఇన్ఫెక్షన్లను దూరం చేసి, జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ఆధునిక ఒత్తిళ్లతో సతమతమయ్యే వారికి నోని ఒక మంచి ఔషధం. ఇది మెదడులో సెరటోనిన్ స్థాయిలను క్రమబద్ధీకరించి, మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. తద్వారా నిద్రలేమి (Insomnia) సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అయితే, ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన ఫలాలను పొందాలనుకునే వారు ఏలూరు జిల్లాలో పలువురు రైతులు ఈ సహజసిద్ధమైన మొక్కను తమ ఇంటి పరిసరాల్లోనూ, తోటల్లో పెంచుతున్నారు. ప్రకృతి మనకు అందించిన ఈ అద్భుత ఔషధ భాండాగారాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నిత్య జీవితంలో దీనిని భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం కావడం ఖాయం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు