
చాలా మంది ఆడవాళ్లు, అమ్మాయిలు పొడవాటి, నల్లని, ఒత్తైన జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటారు. అయితే, ఈ రోజుల్లో సరైన సంరక్షణ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జుట్టుకు నూనె రాయకపోవడం, కఠినమైన రసాయనాలు కలిగిన షాంపూలు, హెయిర్ కలర్లు, హెయిర్ డైలను ఉపయోగించడం వంటివి జుట్టుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీనివల్ల జుట్టు విరిగిపోవడం, పలచబడటమే కాకుండా, జుట్టు పెరుగుదల కూడా కుంటుపడుతుంది. శరీరానికి సరైన పోషకాలు అందనప్పుడు, అది నేరుగా జుట్టుపై ప్రభావం చూపుతుంది. మీ జుట్టు పెరగకపోయినా లేదా చాలా నెమ్మదిగా పెరుగుతున్నా, మీరు ప్రతిరోజూ కొన్ని జుట్టు సంరక్షణ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారానికి ఒక అంగుళం జుట్టు పెరగడం అసాధ్యం. సగటున, జుట్టు నెలకు సుమారు 1-1.5 సెం.మీ (దాదాపు 0.4-0.6 అంగుళాలు) పెరుగుతుంది. అయితే, సరైన సంరక్షణ లేకుండా కూడా, ఒక వారంలో ఇంత జుట్టు పెరుగుదల సాధ్యం కాదు. సరైన సంరక్షణతో మీరు వేగవంతమైన, బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను పొందవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం..
జుట్టు పెరుగుదలకు రక్త ప్రసరణ చాలా ముఖ్యం. కొబ్బరి నూనె లేదా బాదం నూనెను గోరువెచ్చగా చేసి వారానికి రెండు సార్లు తలకు మసాజ్ చేయాలి. దీనివల్ల జుట్టు కుదుళ్లకు పోషణ అంది, జుట్టు వేగంగా పెరుగుతుంది.
కలబంద జుట్టుకు సహజమైన కండిషనర్‌గా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టు రాలడాన్ని అరికట్టి, కొత్త జుట్టు మొలవడానికి సహాయపడుతుంది. ఈ రెండింటిని కలిపి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జుట్టు అనేది కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి మీ ఆహారంలో గుడ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. విటమిన్-E, బయోటిన్ అధికంగా ఉండే ఆహారం జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
అతిగా షాంపూ చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు పోతాయి, కాబట్టి వారానికి రెండు సార్లు మత్రమే తలస్నానం చేయాలి. అలాగే, తడి జుట్టును దువ్వడం వల్ల జుట్టు ఎక్కువగా తెగుతుంది. హీట్ స్టైలింగ్ మెషీన్లను (Hair Dryers/Straighteners) వీలైనంత తక్కువగా వాడాలి.
రాత్రి పడుకునే ముందు జుట్టును వదిలేయకుండా వదులుగా అల్లుకోవడం వల్ల ఘర్షణ తగ్గి జుట్టు విరగకుండా ఉంటుంది. సిల్క్ పిల్లో కవర్లను వాడటం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, మీ జుట్టులో స్పష్టమైన మార్పును గమనించవచ్చు. సహజ పద్ధతుల ద్వారా పొందే అందం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందని గుర్తుంచుకోండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏదైనా కొత్త ఆహారం, ఔషధాలు, హోం రెమిడీస్ ప్రయత్నిస్తున్న తప్పక వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..