Interesting Facts: రెండు సుడులు ఉంటే.. రెండు పెళ్లిళ్లు అవుతాయా.. నిజమేనా!

| Edited By: Ravi Kiran

Dec 17, 2023 | 3:30 PM

సాధారణంగా కొంతమంది మగవారికి కానీ, స్త్రీలకు కానీ తల మీద రెండు సుడులు ఉంటాయి. ఇలా నెత్తి మీద రెండు సుడులు ఉంటే.. వారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని ఆట పట్టిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మరి ఇది నిజమేనా? ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం. అధ్యయనం ప్రకారం ఇలా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5 శాతం మందికి ఇలా రెండు సుడులు ఉంటాయట. జన్యుపరమైన లోపాలు అలాగే పూర్వీకులకు ఉన్నా ఇలా తలలో రెండు..

Interesting Facts: రెండు సుడులు ఉంటే.. రెండు పెళ్లిళ్లు అవుతాయా.. నిజమేనా!
Double Whorl
Follow us on

సాధారణంగా కొంతమంది మగవారికి కానీ, స్త్రీలకు కానీ తల మీద రెండు సుడులు ఉంటాయి. ఇలా నెత్తి మీద రెండు సుడులు ఉంటే.. వారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని ఆట పట్టిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మరి ఇది నిజమేనా? ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం. అధ్యయనం ప్రకారం ఇలా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5 శాతం మందికి ఇలా రెండు సుడులు ఉంటాయట. జన్యుపరమైన లోపాలు అలాగే పూర్వీకులకు ఉన్నా ఇలా తలలో రెండు సుడులు వస్తాయట. అసలు రెండు సుడులు ఎందుకు వస్తాయి? వీరికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు పెళ్లిళ్లు చేసుకుంటారా..

తలలో ఇలా రెండు సుడులు ఉంటే వారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని గ్రామీణ ప్రాంతాల్లో అంటూ ఉంటారు. రెండు సుడులు ఉన్నంత మాత్రాన రెండు పెళ్లిళ్లు చేసుకుంటారనేది కేవలం అపోహ మాత్రమే. ఈ నిజం ఇప్పటివరకూ రుజువు కాలేదని, కేవలం నమ్మకాల మీద ఇది ఆధారపడి ఉంటుందని శాస్త్ర నిపుణులు అంటున్నారు.

మంచి గుణాలు ఉంటాయి..

తలలో రెండు సుడులు ఉన్న వారికి మంచి గుణాలు ఉంటాయట. వారు ప్రేమ, సహాయం, సహనం వంటి లక్షణాలను కలిగి ఉంటారని జోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు గొడవలు, తగాదాలకు దూరంగా ఉంటారట.

ఇవి కూడా చదవండి

జన్యువుల లోపం కారణంగా..

జన్యువుల లోపం కారణంగానే ఈ లోపం వస్తుందని.. దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పురుషులకు కానీ, మహిళలకు కానీ ఇది వారసత్వం నుంచి కూడా వస్తుందట. ఇది కేవలం శరీరంలో ఒక లక్షణం మాత్రమేనని వెల్లడించారు.

రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని అపోహ..

రెండు సుడులు ఉన్న స్త్రీలు కానీ, పురుషులు కానీ రెండు సార్లు పెళ్లి చేసుకుంటారని నమ్ముతారు. లేదంటే ముహూర్తం కుదిరిన తర్వాత చెడిపోయి.. మరో పెళ్లి చేసుకుంటారని పలు ప్రచారాలు కూడా ఉన్నాయి. కానీ శాస్త్రం ప్రకారం మాత్రం.. రెండు సుడులు ఉంటే మంచివారని, ఓపికగా ఉంటారని, అందరితో కలిసి పోతారని చెబుతున్నారు. అంతే కాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా సంతోష పెట్టేందుకు ట్రై చేస్తారట.