Weight Loss Diet: త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఓ సారి ఈ డైట్‌ను ట్రై చేయండి..

|

Nov 20, 2022 | 7:45 PM

బరువు తగ్గడం కోసం చాలా మంది ఎన్నో రకాల డైట్‌లు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల డైట్‌లు మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని అనుకున్న రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. కాని లో-కార్బ్​, హై ప్రోటీన్​ డైట్​ బరువు తగ్గాలనుకునే వారికి, శరీర ధృడత్వాన్ని కోరుకునే వారికి మంచిదని నిపుణులు..

Weight Loss Diet: త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఓ సారి ఈ డైట్‌ను ట్రై చేయండి..
Food
Follow us on

బరువు తగ్గడం కోసం చాలా మంది ఎన్నో రకాల డైట్‌లు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల డైట్‌లు మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని అనుకున్న రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. కాని లో-కార్బ్​, హై ప్రోటీన్​ డైట్​ బరువు తగ్గాలనుకునే వారికి, శరీర ధృడత్వాన్ని కోరుకునే వారికి మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ రకమైన డైట్​తో షుగర్​ లెవల్స్​ కూడా నియంత్రణలో ఉంటాయంటున్నారు. కార్బోహైడ్రేట్​ని తక్కువ తీసుకుంటే.. శరీరంలో గ్లూకోజెన్​ తక్కువ ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఫ్యాట్​ బర్నింగ్​ వేగంగా జరుగుతుందని సూచిస్తున్నారు. రెగ్యులర్​గా ఈ డైట్​ ఫాలో అయితే.. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఫలితాలు ఇస్తోందంటున్నారు నిపుణులు. హై ప్రోటీన్​ డైట్​తో ఎక్సర్​సైజ్​లు చేస్తే.. వెయిట్​లాస్​ కావడంతో పాటు లీన్​ మజిల్​ మాస్​ కూడా పెరుగుతుంది. కొన్ని రకాల కార్బ్​, హై ప్రోటీన్​ ఆహారాల గురించి తెలుసుకుందాం.

గ్రీక్​ యోగర్ట్​

కొన్నిసార్లు ఆకలి వేయకపోయినా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఏది బడితే అది తింటే .. వెయిట్​లాస్​ ప్రోగ్రాం దెబ్బతింటుంది. ఈ సమయంలో గ్రీక్​ యోగర్ట్​ చాలా ఉపయోగపడుతుంది. సాధారణ పెరుగు కన్నా ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఈ రిచ్​ ప్రోటీన్​ సోర్స్​తో క్రేవింగ్స్​ని నియంత్రించుకోవచ్చు. పొట్ట ఉబ్బడాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. దీనిలో కాల్షియం, ప్రోటీన్​, ప్రోబయోటిక్స్​తో పాటు ఎన్నో అవసరమైన పోషకాలు ఉన్నాయి.

సన్​ఫ్లవర్​ సీడ్స్

సన్‌ ఫ్లవర్ సీడ్స్‌ను పొద్దుతిరుగుడు గింజలు అని కూడా అంటారు. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే.. ఈ సీడ్స్​ మంచి ఎంపిక​. వీటిలో ప్రోటీన్​, ఫైబర్​తో పాటు విటమిన్​ ఈ, కాపర్​ వంటి మినరల్స్​ కూడా ఉంటాయి. సలాడ్​లు, క్రీమ్స్​, పచ్చి కూరగాయలపై టాపింగ్స్​గా కూడా వేసుకుని వీటిని తినొచ్చు. ఈ సీడ్స్​ని తినడం వల్ల డైమెన్షియా వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సాల్మన్

సాల్మన్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​, గుడ్​ ఫ్యాట్స్​, ప్రోటీన్​ కంటెంట్​ ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే ఎంతో ఆరోగ్యకరం, బరువు తగ్గాలనుకునేవారికి మంచి డైట్ అవుతుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది. పొత్తికడుపులోని కొవ్వును తగ్గిస్తుంది. లీన్​ మజిల్​ టిష్యూ ఎదుగుదలకు.. ఇది ఎంతో ముఖ్యమైన మాక్రోన్యూట్రీషియన్​గా ఉంటుంది. మూడు ఔన్స్​ల సాల్మన్​ని తీసుకుంటే.. 108 క్యాలరీలు, 17 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది.

రోస్టెడ్​ చిక్​పీస్​

వేయించిన శెనగలను రోస్టెడ్​ చిక్​పీస్​ అంటారు. వీటిలో పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. ఇదొక హై ప్రోటీన్​, ఫైబర్​ పదార్థం. వెయిట్​లాస్​లో ఉన్న వారు కచ్చితంగా ట్రై చేయాల్సిన ఆహార పదార్థంగా చెప్పుకోవచ్చు. వీటిని ఎందులోనైనా కలుపుకుని తినేయవచ్చు. మొత్తానికి బరువు తగ్గాలనుకునేవారు హై ప్రోటీన్​ డైట్​ను ఎంచుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..