Health: ఆలస్యంగా నిద్రపోయే వారిలో.. ఈ వ్యాధి వచ్చే అవకాశాలు 46 శాతం అధికం

|

Sep 10, 2024 | 4:09 PM

అయితే రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోయే వారిలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన నిద్రలేని వారికి శారీరకంగా, మానసికంగా పలు రకాల సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆలస్యంగా నిద్రపోయే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది...

Health: ఆలస్యంగా నిద్రపోయే వారిలో.. ఈ వ్యాధి వచ్చే అవకాశాలు 46 శాతం అధికం
Sleep
Follow us on

ఒకప్పుడు ప్రజలు త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్రలేచే వారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. మారిన జీవన విధానం, వృత్తిపరంగా నైట్‌ ఫిష్ట్స్‌లో పనిచేయడం వల్ల చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఇక ఏ పని లేని వారు కూడా రాత్రుళ్లు సోషల్‌ మీడియాలో గడుపుతూ గంటల కొద్దీ ఫోన్‌తో కుస్తీలు పడుతున్నారు.

అయితే రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోయే వారిలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన నిద్రలేని వారికి శారీరకంగా, మానసికంగా పలు రకాల సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆలస్యంగా నిద్రపోయే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా పడుకొని, ఉదయం ఆలస్యంగా లేచే వారిలో టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం 46 శాతం ఎక్కువగా ఉంటుదని ఓ అధ్యయనంలో తేలింది.

నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధనలో భాగంగా అధిక బరువుతో బాధపడుతున్న 5వేల మందిని పరిగణలోకి తీసుకున్నారు. వీరిని మొత్తం మూడు భాగాలుగా విభజించారు. త్వరగా నిద్రలేచే వారు, సగటు సమయానికి మేల్కొనే వారు, ఆలస్యంగా మేల్కోనేవారు. ఇలా మూడు రకాలుగా విభజించారు. వీరిపై అధ్యయనం నిర్వహించిన అనంతరం ఆలస్యంగా నిద్రపోయే వారిలో టైప్‌2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను యూరోపియన్‌ యూనియన్‌లో వివరించారు.

రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తుల బయో క్లాక్ చెదిరిపోతుందని, వారి శరీరంలో టైప్ 2 డయాబెటిస్, జీవక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనంలో ఏతలింది. అలాగే వీరిలో అధిక BMI, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని తేలింది. కాబట్టి భవిష్యత్తుల్లో డయాబెటిస్‌ బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం, శారీరక శ్రమతో పాటు రాత్రుళ్లు త్వరగా పడుకోవడాన్ని కూడా అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..