ప్రస్తుత కాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కేకులు..పిజ్జా బర్గర్లు అంటూ ఎక్కుగా తినేస్తున్నారు.. అయితే ఇలాంటి జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ప్రమాదం తప్పదంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తీసుకునే జంక్‌ఫుడ్స్ వల్ల ఫ్యూచర్‌లో పెద్ద ప్రమాదమే ఎదుర్కొవాల్సి వస్తోందంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. కేక్స్, బిస్కెట్లు, జంక్‌ఫుడ్స్ వంటి పదార్థాలు తీసుకునే పిల్లల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. దాదాపు పదేళ్ల పాటుగా వారు అనేక మంది టీనేజీ పిల్లలపై పరిశోధన చేసిన అనంతరం వారు సేకరించిన సమాచారాన్ని బయటపెట్టారు. సాంప్రదాయ ఆహారం కాకుండా జంక్‌ఫుడ్‌లో ఉండే కొవ్వులు, నూనెల కారణంగా వారిలో ముందుముందు రొమ్ముక్యాన్సర్‌కు గురిచేస్తాయని వారు స్పష్టం చేశారు. వాటికి తోడుగా ఆల్కహాల్ వంటి అలవాట్లు తోడైతే అది మరింత హానీ చేస్తుందని వారు తెలిపారు. సో..మీ పిల్లలు తీసుకునే ఆహారంపై ఎప్పుడు జాగ్రత్తవహించండి.