Purple Foods: పర్పుల్ కలర్ ఫుడ్స్ తీసుకుంటే.. మీ శరీరంలో జరిగే ఈ మ్యాజిక్ గురించి తెలుసా..?

| Edited By: Janardhan Veluru

Jun 11, 2024 | 4:07 PM

అందమైన చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. అందమైన చర్మం కోసం అనేక మెరుగులు దిద్దుతూ ఉంటారు. మగవారైనా, ఆడవారైనా అందంగా కనిపించాలని చాలా పరితపిస్తూ ఉంటారు. ఇందుకు మార్కెట్లో కనిపించే ఎన్నో ప్రోడెక్ట్స్ వాడుతూ ఉంటారు. అయితే వీటితో దీర్ఘకాలంలో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే.. అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. అందమైన చర్మం కావాలంటే..

Purple Foods: పర్పుల్ కలర్ ఫుడ్స్ తీసుకుంటే.. మీ శరీరంలో జరిగే ఈ మ్యాజిక్ గురించి తెలుసా..?
Purple Color Food
Follow us on

అందమైన చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. అందమైన చర్మం కోసం అనేక మెరుగులు దిద్దుతూ ఉంటారు. మగవారైనా, ఆడవారైనా అందంగా కనిపించాలని చాలా పరితపిస్తూ ఉంటారు. ఇందుకు మార్కెట్లో కనిపించే ఎన్నో ప్రోడెక్ట్స్ వాడుతూ ఉంటారు. అయితే వీటితో దీర్ఘకాలంలో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే.. అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. అందమైన చర్మం కావాలంటే.. అందుకు తగ్గట్టు ఆహారాలు కూడా తీసుకోవాలి. అందాన్ని పెంచడంలో పర్పుల్ కలర్ ఫుడ్స్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. మరి పర్పుల్ కలర్‌లో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బీట్ రూట్:

చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చడంలో బీట్ రూట్ ఎంతో చక్కగా పని చేస్తుంది. బీట్ రూట్‌ని ఏ విధంగా తీసుకున్నా.. శరీరానికి మేలే చేస్తుంది. హెల్దీ స్కిన్‌ కావాలి అనుకునే వారు. బీట్ రూట్ జ్యూస్ తాగడం, సలాడ్స్‌లో తీసుకోవడం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా స్కిన్‌ సమస్యలు అన్నీ దూరమవుతాయి.

పర్పుల్ క్యాబేజ్:

పర్పుల్ కలర్ క్యాబేజ్ తీసుకోవడం వల్ల కూడా చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ క్యాబేజ్‌లో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవడం వల్ల చర్మం మెరిచేందుకు హెల్ప్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

వంకాయ:

వంకాయలు తినడం వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా మారేందుకు సహాయ పడుతుంది. వంకాయల్ని చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వంకాయలో కూడా విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తీసుకోవడంలో చర్మ సంరక్షణంకు అద్భుతంగా పని చేస్తుంది.

ద్రాక్ష:

ద్రాక్షలో కూడా ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మ అందాన్ని పెంచడంలో చక్కగా సహాయ పడతాయి. సూర్యని కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ద్రాక్షలో విలమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..