Pink Lips: సహజంగా పింక్‌ కలర్‌ పెదాలు కావాలంటే.. ప్రతి రోజూ రాత్రి నిద్రకు ముందు ఇలా చేయండి

|

Oct 12, 2024 | 1:10 PM

మగువలకు అందంపై కాస్త శ్రద్ధ ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఎన్ని పనులున్నా వారానికి ఒక్కసారైనా బ్యూటీ పార్లర్‌కి వెళ్లి అందానికి మెరుగులు అద్దుతుంటారు. అయితే కొంత మందికి ఎంత ప్రయత్నించిన పెదాలపై నల్లని ట్యాన్‌ తొలగిపోదు. ముఖ్యంగా పింక్ పెదాలు పొందాలని అందరూ కోరుకుంటారు..

Pink Lips: సహజంగా పింక్‌ కలర్‌ పెదాలు కావాలంటే.. ప్రతి రోజూ రాత్రి నిద్రకు ముందు ఇలా చేయండి
Pink Lips
Follow us on

మగువలకు అందంపై కాస్త శ్రద్ధ ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఎన్ని పనులున్నా వారానికి ఒక్కసారైనా బ్యూటీ పార్లర్‌కి వెళ్లి అందానికి మెరుగులు అద్దుతుంటారు. అయితే కొంత మందికి ఎంత ప్రయత్నించిన పెదాలపై నల్లని ట్యాన్‌ తొలగిపోదు. ముఖ్యంగా పింక్ పెదాలు పొందాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరికే ఇది సాధ్యం అవుతుంది. ధూమపానం, ఆల్కహాల్‌ అలవాట్లు, కొన్ని అనారోగ్య సమస్యల వల్ల పెదవులు కొద్దిగా నల్లబడతాయి. నిజానికి, ముఖం అందాన్ని ఇనుమడించేది పెదవులే. అయితే కొందరి పెదవులు మాత్రం మృదుత్వాన్ని కోల్పోయి నల్లగా మారుతాయి. ఇది సూర్య కిరణాల ప్రభావం వల్ల కావొచ్చు లేదంటే ధూమపానం మొదలైన వాటి వల్ల కూడా ఇలా అవుతుంది. పెదాలపై ట్యాన్ తొలగించి, వాటిని అందంగా మార్చాలంటే ఈ కింది టిప్స్‌ ఫాలో అయిపోండి..

అరటి మాస్క్

అరటిపండు, పెరుగు, తేనెను ఒక గిన్నెలో వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో పెదవుల చుట్టూ అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తుంటే డార్క్ స్కిన్ లేదా డార్క్ లిప్స్ తగ్గుతాయి.

దానిమ్మ

దానిమ్మ రసాన్ని రాత్రి పడుకునే ముందు పెదవులకు రాసుకుంటే పెదాలపై నల్లని ట్యాన్‌ పోయి.. కొద్ది రోజుల్లోనే పెదాలు అందంగా మారుతాయి.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం

నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు దీనిని అద్భుతమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పని చేస్తాయి. కాబట్టి పెదవుల రంగును పెంచడానికి దీనిని ఉపయోగించవచ్చు. నిమ్మరసాన్ని పెదవులపై, క్రమం తప్పకుండా అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తుంది.

గులాబీ రేకులు

20 గ్రాముల గులాబీ రేకులను తీసుకుని వాటిని మెత్తగా చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవు పాలను కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ప్రతిరోజూ పెదాలకు రాసుకుంటే పెదాలకు మంచి రంగు వస్తుంది.

బాదం

పెదాల చుట్టూ ఉన్న నల్లని చర్మాన్ని కాంతివంతం చేసే శక్తి బాదంపప్పుకు ఎప్పుడూ ఉంటుంది. బాదం నూనెను పెదవులపై అప్లై చేస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా 4-6 బాదంపప్పులను తీసుకుని పాలలో రాత్రంతా నానబెట్టాలి. దీన్ని ఉదయాన్నే పేస్ట్‌లా చేసి పగిలిన పెదవులపై, పెదవుల చుట్టూ రాసుకుంటే మంచి మార్పు కనిపిస్తుంది.

అలోవెరా

రాత్రి పడుకునే ముందు కలబంద జెల్‌ను రాసి రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే పెదాలు నల్లబడకుండా అందంగా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.