AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol: మద్యం తాగితే శరీరంలో జరిగే మార్పులివే..

ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యం సేవించడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిసిందే. అయితే ఆల్కహాల్‌ తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.? ఏ అవయవంపై ఎక్కువ ప్రభావం పడుతుంది...

Alcohol: మద్యం తాగితే శరీరంలో జరిగే మార్పులివే..
Health
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 08, 2024 | 10:16 PM

Share

బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మందు బాబులు మొదట చేసే పని ఓ పెగ్గు వేయడం. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా మందు బాబుబుల మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. ఇంతకీ ఆల్కహాల్‌ తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.? అసలు శరీరంలోని ఏ భాగంపై ఆల్కహాల్‌ ఎక్కువగా ప్రభావం చూపుతుందని లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆల్కహాల్‌ తీసుకున్న వెంటనే రక్తంలో కలుస్తుంది. దీంతో అది మెదడుకు సంకేతాలను పంపిస్తుంది. మొదట మాటల్లో తేడా వస్తుంది. ఆ తర్వాత శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. తను చాలా తెలివిగల వ్యక్తినని అన్న భావన కలిగిస్తుంది. ఇక ఆల్కహాల్‌ శరీరంలో ఎక్కువగా ప్రభావం చూపేది లివర్‌పైనే. శరీరంలో రెండో అతిపెద్ద అవయవమైన కాలేయం మనం తీసుకునే ఆహారం, తాగే వాటి నుంచి పోషకాలను ప్రాసెస్‌ చేస్తుంది. పోషకాలను అన్ని అవయవాలకు పంపిణీ చేస్తుంది.

ప్రతీరోజూ లేదా వారానికి 3 నుంచి 4 సార్లు అధికంగా ఆల్కహాల్‌ తీసుకుంటే.. కాలేయం దెబ్బతినే ప్రమాదం 5 నుంచి 10 ఏళ్లలో గణనీయంగా పెరుగుతుంది. దీని వల్ల లివర్ సిర్రోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఆల్కహాల్ విచ్ఛిన్నం చేయడంలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎవరైనా ఆల్కహాల్ తాగినప్పుడు, కాలేయం ఆల్కహాల్‌ను ఎసిటాల్డిహైడ్‌గా మార్చుతుంది. ఇది విషపూరిత సమ్మేళనం.

ఎసిటాల్డిహైడ్‌ను అసిటేట్‌గా మార్చిన తర్వాత, కాలేయంలో ఉండే ఎంజైమ్ దానిని కార్బన్ డయాక్సైడ్‌తో పాటు నీరుగా విభజించి శరీరం నుండి తొలగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలేయం ప్రతి గంటకు కొంత మొత్తంలో ఆల్కహాల్‌ను మాత్రమే జీర్ణం చేస్తుంది. అందుకే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాలేయం దెబ్బ తినడానికి కారణమవుతుంది.

సాధారణంగా తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ తీసుకున్న ఫిల్టర్‌ చేయడాని 2 నుంచి 4 గంటలు పడుతుంది. కాలేయం 6-12 గంటల్లో 3-5 పెగ్‌ల ఆల్కహాల్‌ను ఫిల్టర్ చేయగలదు. కాలేయం 6 పెగ్‌ల కంటే ఎక్కువ ఆల్కహాల్ క్లియర్ చేయడానికి 24 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంది. ఇక పరిమితికి మించి మద్యం సేవించే వారిలో లివర్‌ ఫిల్టర్‌ చేయడానికి కొన్ని సందర్భాల్లో రోజుల నుంచి వారాలు కూడా పడుతుండొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బులు పంపించవచ్చు.. ఎలా అంటే..?
బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బులు పంపించవచ్చు.. ఎలా అంటే..?
అక్షయ నవమి ఎప్పుడు? ఈ సమయంలో ఉసిరి చెట్టును పూజిస్తే సిరిసంపదలు!
అక్షయ నవమి ఎప్పుడు? ఈ సమయంలో ఉసిరి చెట్టును పూజిస్తే సిరిసంపదలు!
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ !
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ !
బాబోయ్.. ఏపీకి మరో తుఫాన్‌ గండం..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
బాబోయ్.. ఏపీకి మరో తుఫాన్‌ గండం..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం..
ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం..
ఈ చిత్రంలోని తేడాగా ఉన్న ఇమోజీని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
ఈ చిత్రంలోని తేడాగా ఉన్న ఇమోజీని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
మనవరాలిని కాపాడి ప్రాణాలు వదిలిన దంపతులు.. పూరి యాత్రలో విషాదం!
మనవరాలిని కాపాడి ప్రాణాలు వదిలిన దంపతులు.. పూరి యాత్రలో విషాదం!
సిగరెట్ల ధరలు మరోసారి పెంపు.. ఒకేసారి ఎంతంటే..?
సిగరెట్ల ధరలు మరోసారి పెంపు.. ఒకేసారి ఎంతంటే..?
బాలయ్య పాడిన పాట.. దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది.. తమన్ మళ్లీ..
బాలయ్య పాడిన పాట.. దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది.. తమన్ మళ్లీ..
లోకేష్‌, రానా మధ్య ఫిలిం ఇండస్ట్రీపై ఆసక్తికర చర్చ
లోకేష్‌, రానా మధ్య ఫిలిం ఇండస్ట్రీపై ఆసక్తికర చర్చ
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో