Beauty Tips: ఈ 4 పండ్లతో ముఖంపై ముడతలు మాయం..! ఎలాగో తెలుసుకోండి..

|

Nov 22, 2021 | 9:03 PM

Beauty Tips: ఆధునిక జీవన శైలిలో చాలామందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. దీనికి కారణం వాతావరణ పరిస్థితులు, ఆహార పద్దతులు కారణమవుతున్నాయి.

Beauty Tips: ఈ 4 పండ్లతో ముఖంపై ముడతలు మాయం..! ఎలాగో తెలుసుకోండి..
Homemade
Follow us on

Beauty Tips: ఆధునిక జీవన శైలిలో చాలామందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. దీనికి కారణం వాతావరణ పరిస్థితులు, ఆహార పద్దతులు కారణమవుతున్నాయి. అంతేగాక చర్మం పొడిబారిపోయి అంద విహీనంగా తయారవుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అకాల వృద్ధాప్యంతో చాలామంది బయటతిరగాలంటే అదరోకంగా ఫీలవుతుంటారు. అలాంటివారికి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఫేస్‌ ప్యాక్‌ తయారుచేసుకోవచ్చు. ఇవి చర్మానికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి.

1. కివి ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్‌ ప్యాక్‌
కివిలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం మీకు 1 ఒలిచిన, మెత్తని కివి, 3 టేబుల్ స్పూన్లు గ్రాన్యులేటెడ్ చక్కెర అవసరం. కివీ, పంచదార కలపండి వెంటనే మీ ముఖం పై అప్లై చేయండి. 30 సెకన్ల పాటు సున్నితంగా స్క్రబ్ చేసి ఆపై కడిగితే సరిపోతుంది.

2. బొప్పాయి ఫేస్‌ ప్యాక్‌
బొప్పాయి ఫేస్ ప్యాక్ కొల్లాజెన్‌ను ఉత్తత్తికి సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో పెప్జైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. బొప్పాయి ఫేస్‌ ప్యాక్‌ చేయడానికి చేయాల్సిందల్లా బొప్పాయి గుజ్జులో 2-3 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. గుమ్మడికాయ-పెరుగు
గుమ్మడికాయతో అద్భుతమైన ఫేస్ ప్యాక్‌ తయారుచుసుకోవచ్చు. ఇందులో కొల్లాజెన్ అధికంగా ఉంటుంది. దీని కోసం మీకు కప్పు తేనె, గుమ్మడికాయ ముక్కలు, కప్పు సాదా పెరుగు, బాదం, ఆలివ్ నూనె అవసరం. అన్ని పదార్థాలను కలపండి మీ చర్మంపై అప్లై చేయండి.10 నిమిషాల తర్వాత మీరు కడిగి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. తరచూ ఇలా చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి.

4. క్యారెట్లు
క్యారెట్‌లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని కోసం మీకు 1 ఉడికించిన క్యారెట్, 2 టేబుల్ స్పూన్ల తేనె, కప్పు సాదా పెరుగు అవసరం. అన్ని పదార్థాలను కలిపి ఒక ప్యాక్‌ లా చేసి దానిని ముఖం పై అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడుక్కోవాలి. మంచి ఫలితాలు ఉంటాయి.

Health Tips: ఇంట్లో ఉండే మహిళలకు ఈ 4 యోగాసనాలు.. శరీరానికి అద్భుత ప్రయోజనాలు..

Health News: రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా..! చాలా హానికరం..

Salman Khan: త్వరలో దేశవ్యాప్తంగా ‘సల్మాన్ టాకీస్’.. స్పష్టం చేసిన కండల వీరుడు..