ఇటీవల గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చిన్న వయసు వారు కూడా గుండె పోటుకు గురికావడం అందరినీ కలవరపెడుతోంది. అయితే గుండె జబ్బులను త్వరగా గుర్తించి, చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. పలు రకాల లక్షణాల ఆధారంగా గుండెపోటును ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఓ లక్షణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్, కాళ్ల వాపు గుండె జబ్బుకు ప్రాథమిక సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు. కాళ్లలో వాపు గుండె వైఫల్యానికి సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణలో సమస్యలు కూడా గుండె వైఫల్యానికి కారణమ తెలిసిందే. రక్త ప్రసరణలో సమస్య ఉంటే.. పాదాలలో నీరు నిండుతుంది. దీంతో ఇది పాదం వాపునకు దారి తీస్తుంది. అందుకే కాళ్లలో వాపు గుండె జబ్బుకు ప్రాథమిక సంకేతంగా చెబుతుంటారు.
అందుకే కాళ్లు వాపునకు గురైతే ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. పాదాలు, చీలమండలు, పొత్తికడుపు వాపు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాళ్లు, పాదాలలో వాపును పెరిఫెరల్ ఎడెమా అంటారు. దీంతో కాళ్లు బరువుగా ఉంటాయి. చర్మంలో కూడా వాపు లక్షణాలు కనిపిస్తాయి. బూట్లు ధరించడంలో ఇబ్బంది ఉంటుంది. అలాగే వాపు కూడా పాదాలు వేడిగా, గట్టిగా మారడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని తెలిసిందే. అలాంటి పరిస్థితిలో, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆయిల్ ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి. ప్రతీ రోజూ కచ్చితంగా వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. తీసుకునే ఆహారంలో ఉప్పును పూర్తిగా తగ్గించాలి. శరీరంలో సోడియం పరిమాణం పెరిగితే అది వాపునకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో సమయాన్ని వృథా చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..